Twitter | ట్విట్టర్లో కొత్త ఫీచర్.. ఆలోచనలో కంపెనీ
Twitter | ప్రఖ్యాత సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వేదికల్లో షేరింగ్ ఆప్షన్ అందుబాటులో

ప్రఖ్యాత సోషల్ మీడియా సంస్థ ట్విట్టర్ కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చే యోచనలో ఉందని తెలుస్తోంది. ఇప్పటి వరకూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వేదికల్లో షేరింగ్ ఆప్షన్ అందుబాటులో ఉంది. ఈ ఫీచర్ ట్విట్టర్లో లేదు. ఇప్పుడు దీన్నే తీసుకొచ్చేందుకు కంపెనీ ఆలోచిస్తోందని సమాచారం.
కొంత మంది గ్రూపుతో తమకు నచ్చిన ట్వీట్లను షేర్ చేసుకోవచ్చు. దీనిపై డెవలపర్ అలెజాండ్రో పాలుజ్జి మాట్లాడుతూ.. ట్విట్టర్ యూజర్లు తమ స్నేహితుల్లో 150 మందిని ఒక గ్రూప్‌గా చేసుకోవచ్చు. దీన్ని ‘ట్విట్టర్ ఫ్లాక్’ అంటున్నారట. ఈ గ్రూప్‌తో మాత్రమే ట్వీట్లను షేర్ చేసుకునే వీలుంటుంది.
ఈ గ్రూప్‌లో షేర్ చేసిన ట్వీట్లపై ఈ గ్రూప్‌లోని సభ్యులు మాత్రమే చూడగలుగుతారు. అలాగే రిప్లై ఇవ్వగలుగుతారని తెలుస్తోంది. ఈ ఫ్లాక్ నుంచి ఎవరినైనా తొలగించినా సదరు సభ్యుడికి ఎటువంటి నోటిఫికేషన్ లభించదని అలెజాండ్రో వివరించారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే త్వరలోనే ఈ ఫీచర్‌ను ట్విట్టర్ అందుబాటులోకి తీసుకొస్తుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

