Twitter CEO Jack Dorsey | ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సీ గుడ్‌బై!
Twitter CEO Jack Dorsey | ట్విట్టర్ సీఈవోగా జాక్ డోర్సీ వైదొలిగారు. ఆయన స్థానే సంస్థ సీటీవో పరాగ్ అగర్వాల్ నియమితులైనట్లు సమాచారం.

Twitter CEO Jack Dorsey | మైక్రో బ్లాగింగ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ ఇంక్ సీఈవో జాక్ డోర్సీ వైదొలిగారు. ఆయన స్థానంలో నూతన సీఈవో ఎంపిక విషయమై జాక్ డోర్సీ, ట్విట్టర్ బోర్డు మధ్య ఏకాభిప్రాయం కుదిరినట్లు సమాచారం. జాక్ డోర్సీ వారసుడిగా కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. గతేడాది నుంచే డోర్సీని సీఈవోగా సాగనంపేందుకు ట్విట్టర్ బోర్డు సిద్ధం అవుతున్నది. ట్విట్టర్ సీఈవోగా జాక్ డోర్సీ వైదొలగనున్నారన్న వార్తలపై స్పందించేందుకు సంస్థ అధికార ప్రతినిధి అందుబాటులోకి రాలేదు. అయితే, ఆయన వైదొలిగారన్న విషయమై గానీ.. ఆయన వారసుడెవరన్న విషయమై గానీ ఇప్పటికైతే అధికారిక ప్రకటన వెలువడలేదు.
ఆదివారం డోర్సీ చివరి ట్వీట్ ఇలా
ట్విట్టర్ సీఈవోగా డోర్సీ వైదొలుగుతారన్న వార్తల నేపథ్యంలో సంస్థ స్క్రిప్ట్ ప్రారంభంలో 11 శాతం పెరిగింది. డోర్సీ సారధ్యంలోని డిజిటల్ పేమెంట్స్ సంస్థ స్క్వేర్ ఇంక్ మూడు శాతం పెరిగింది. ఆదివారం చివరిగా జాక్ డోర్సీ చేసిన ట్విట్లో.. నేను ట్విట్టర్‌ను ప్రేమిస్తాను అని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌ను సోమవారం 54 వేల మందికి పైగా లైక్ చేశారు. జాక్ డోర్సీ వైదొలగనున్నారన్న వార్తను ప్రముఖ చానెల్ సీఎన్‌బీసీ రిపోర్ట్ చేసింది.
గతేడాది డోర్సీపై ఇలా ఒత్తిడి
గతేడాది ప్రారంభంలో ఎల్లియట్ మేనేజ్మెంట్ గ్రూప్ నుంచి జాక్ డోర్సీని తొలగించాలన్న డిమాండ్ బలంగా వినిపించింది. ట్విట్టర్‌ను ఆయన పెద్దగా పట్టించుకోవడం లేదని ఎల్లియట్ మేనేజ్మెంట్ గ్రూప్ వాదన. పేమెంట్ ప్రాసెసింగ్ కంపెనీ స్క్వేర్ ఇంక్‌ను ట్విట్టర్ నిర్వహిస్తున్నదని ఆరోపించింది. ఆయన రాజీనామా తక్షణం అమలులోకి వస్తుందని, ఇక నుంచి డైరెక్టర్‌గా 2022 వరకు కొనసాగుతారని ట్విట్టర్ వర్గాలు తెలిపాయి. తానూ ట్విట్టర్ సీఈవోగా వైదొలుగుతున్నట్లు జాక్ డోర్సీ ఓ ప్రకటనలో తెలిపారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
కరోనా కొత్త వేరియంట్‌కు ఒమిక్రాన్ అనే ఎందుకు పేరు పెట్టారు? దీనికి చైనా అధ్యక్షుడికి సంబంధమేంటి?
Omicron | ఒమిక్రాన్ అంత ప్రమాదకరమైనదా? దీన్ని చూసి ప్రపంచ దేశాలు ఎందుకు భయపడుతున్నాయి?
Omicron | ఆఫ్రికా నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా..
Omicron : కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై నెటిజన్ల మీమ్స్ వైరల్
B.1.1.529 | కరోనా కొత్త వేరియంట్ హెచ్ఐవీ రోగుల నుంచి పుట్టుకొచ్చిందా? ఇది అంత ప్రమాదకరమా?
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
- Tags
- jock dorsey
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

