Twitter Logo | ట్విట్టర్ పిట్ట ఎగిరిపోయింది.. బ్లూబర్డ్ ప్లేస్‌లోకి వచ్చేసిన డాగ్ మీమ్
Twitter Logo | ట్విట్టర్ అంటే అందరికీ గుర్తొచ్చేది.. బ్లూకలర్‌లో ఉండే బుల్లిపిట్ట! నీలిరంగులో ఉండే ఆ పిట్ట బొమ్మ ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. కానీ ఇకపై మీకు ట్విట్టర్లో ఆ బ్లూ బర్డ్ ( Blue Bird ) కనిపించదు. దాని స్థానంలో డోజీకాయిన్‌కు సంబంధించిన డోజీ మీమ్ ( Doge Meme ) దర్శనమిస్తోంది.
Twitter Logo | ట్విట్టర్ అంటే అందరికీ గుర్తొచ్చేది.. బ్లూకలర్‌లో ఉండే బుల్లిపిట్ట! నీలిరంగులో ఉండే ఆ పిట్ట బొమ్మ ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. కానీ ఇకపై మీకు ట్విట్టర్లో ఆ బ్లూ బర్డ్ ( Blue Bird ) కనిపించదు. దాని స్థానంలో డోజీకాయిన్‌కు సంబంధించిన డోజీ మీమ్ ( Doge Meme ) దర్శనమిస్తోంది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ట్విట్టర్ ఈ లోగోను మార్చేసింది.
మంగళవారం వేకువజామున ట్విట్టర్ ఓపెన్ చేసిన యూజర్లు బుల్లిపిట్ట ప్లేస్‌లో డాగ్ కనిపించడంతో ఒక్కసారిగా షాకయ్యారు. ట్విట్టర్ హ్యక్ అయ్యిందో ఏమోనని కంగారుపడ్డారు. ట్విట్టర్ లోగో మారిందంటూ సోషల్ మీడియాలో పంచుకున్నారు. దీనిపై ట్విట్టర్ సీఈవో ఎలన్ మస్క్ స్పందించారు. ట్విట్టర్ లోగోను మార్చేసినట్లు ధ్రువీకరించారు. ఇప్పుడు బ్లూ బర్డ్ పాతది అయిపోయిందని.. ఇకపై డోజీ మీమ్ ట్విట్టర్‌కు కొత్త లోగో అని వెల్లడించారు. ఈ మేరకు ఫన్నీ మీమ్‌ను ఎలన్ మస్క్ షేర్ చేశారు. దీంతో పాటు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానంటూ మరో ట్వీట్ కూడా చేశారు.
— Elon Musk (@elonmusk) April 3, 2023
అప్పట్లో ట్విట్టర్ నిబంధనలతో విసుగెత్తిన ఎలన్ మస్క్ 2022 మార్చి 26న ఒక ట్వీట్ చేశాడు. కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ అవసరం ఉందా? అని ప్రశ్నించారు. దీనికి ఒక నెటిజన్.. ట్విట్టర్‌ను కొనుగోలు చేసి.. బర్డ్ లోగోను డోజీతో రీప్లేస్ చేయండి అని సూచించాడు. దానికి సరే అన్నట్టు అప్పట్లో మస్క్ స్పందించాడు. తాజాగా ఈ చాటింగ్‌కు సంబంధించిన స్క్రీన్‌షాట్ షేర్ చేసిన మస్క్.. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానంటూ ట్వీట్ చేశాడు.
As promised pic.twitter.com/Jc1TnAqxAV
— Elon Musk (@elonmusk) April 3, 2023
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

