న్యూఢిల్లీ : ఆధునిక జీవితంలో స్మార్ట్ఫోన్లతో పాటు స్మార్ట్‌వాచ్ కూడా అవసరమైన యాక్సెసరీగా మారింది. బడ్జెట్ స్మార్ట్‌వాచ్‌లు కూడా విస్తృతంగా అందుబాటులోకి రావడంతో పలువురు వీటిని కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు.
స్మార్ట్‌వాచ్‌లు టైమ్, నోటిఫికేషన్స్ చెక్ చేసుకునేందుకే కాకుండా హార్ట్ రేట్, స్లీప్ సైకిల్, స్టెప్ కౌంట్, ఎస్పీఓ2 వంటి హెల్త్ ఫీచర్లు బడ్జెట్ స్మార్ట్ఫోన్ల్లోనూ లభిస్తుండటం కస్టమర్లను ఆకట్టుకుంటోంది. రూ 5000 లోపు బడ్జెట్ స్మార్ట్‌వాచ్‌ల్లో బ్లూటూత్ కాలింగ్ వంటి ఫీచర్లు సైతం అందుబాటులో ఉన్నాయి.
దివాళీ సందర్భంగా పలు స్మార్ట్ వేరబుల్ ప్రోడక్ట్స్‌పై డిస్కౌంట్లు లభిస్తున్నాయి. దివాళీకి మీరు, మీ కుటుంబ సభ్యులు రూ 5000 లోపు స్మార్ట్‌వాచ్‌లు కొనుగోలు చేయాలనుకుంటే ఈ స్మార్ట్ఫోన్లను పరిశీలించండి.
రియల్ మి వాచ్ 3 ప్రొ సిరీస్ : రూ . 4999
వన్‌ప్లస్ నార్డ్ వాచ్ : రూ. 4999
గిజ్మోర్ గ్లో లక్సె : రూ . 3699
నాయిస్ఫిట్ ఎవాల్వ్ 2 : రూ . 2799
డిజో వాచ్ ఆర్ : రూ. 3699
రెడ్మి వాచ్ 2 లైట్ : రూ . 4999