TCS | టెక్కీలకు టీసీఎస్ గుడ్ న్యూస్.. వచ్చే ఏడాది కొత్తగా 1.50 లక్షల మందికి కొలువులు
TCS | లే-ఆఫ్స్ వార్తల మధ్య టెక్కీలకు టీసీఎస్ గుడ్ న్యూస్ తెలిపింది. వచ్చే ఏడాది 1.50 లక్షల కొలువులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.
TCS | పొంచి ఉన్న ఆర్థిక మాంద్యం ముప్పు టెక్కీలకు బ్యాడ్.. అమెజాన్, ఎంటర్ప్రైజ్-సాఫ్ట్వేర్ కంపెనీ సేల్స్‌ఫోర్స్ 25 వేల మందికి పైగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నట్లు ప్రకటించాయి. ఈ నెల 18 నుంచి 18 వేల మందిని అమెజాన్ సాగనంపనున్నట్లు తెలిపాయి. కరోనా వేళ భారీగా ఉద్యోగులను నియమించుకున్న సేల్స్‌ఫోర్స్ పది శాతం మందిని తొలగించింది. ఉద్వాసనలు, లే-ఆఫ్ వార్తల మధ్య టెక్ జెయింట్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్).. టెక్కీలకు గుడ్ న్యూస్ తెలిపింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2023-24)లో 1.25 లక్షల నుంచి 1.50 లక్షల మందిని నియమించుకోనున్నట్లు సంచలన ప్రకటన చేసింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికం నాటికి సంస్థలో ఉద్యోగుల సంఖ్య తగ్గిందని వార్తలొచ్చిన నేపథ్యంలో కొత్త వారిని నియమించుకుంటామని టీసీఎస్ వెల్లడించడం గమనార్హం.
లే-ఆఫ్స్ ఊసెత్తని టీసీఎస్
డిసెంబర్ త్రైమాసికం నాటికి తగ్గిన వర్క్ ఫోర్స్ నష్టాన్ని పూడ్చుకునేందుకు కొత్త నియామకాలు చేపట్టేందుకు టీసీఎస్ కసరత్తు చేస్తున్నది. గత 18 నెలల్లో భారీగా నియామకాలు చేపట్టినా.. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో లే-ఆఫ్స్ ఊసెత్తడం లేదు. `ఓవరాల్‌గా నియామకాల ట్రెండ్ యథాతథంగా కొనసాగుతుంది. వచ్చే ఏడాది 1.25-1.50 లక్షల మందిని నియమించుకుంటాం. మీడియం టర్మ్, లాంగ్ టర్మ్ కోణంలో సంస్థ విశ్వాసాన్ని బలోపేతం చేసుకునేందుకు నియామకాలు కొనసాగుతాయి` అని టీసీఎస్ సీఈవో రాజేశ్ గోపినాథన్ మీడియాకు చెప్పారు.
ఈ ఏడాది 1.03 లక్షల మంది నియామకం
డిసెంబర్ త్రైమాసికంలో సుమారు 2000 మంది వైదొలిగినా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 55 వేల మందికి పైగా నియమించుకున్న టీసీఎస్.. మొత్తం 1.03 లక్షల మందిని కొత్తగా ఉద్యోగాల్లోకి తీసుకోనున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు 42 వేల మందిని నియమించుకుంటామని తెలిపింది. మూడో త్రైమాసికంలో 7,000 మందిని, ఈ ఏడాది తొలి అర్థభాగంలో 35 వేల మందికి పైగా అపాయింట్ చేసుకున్నది. టీసీఎస్ హెచ్ఆర్ చీఫ్ మిలింద్ లక్కడ్ స్పందిస్తూ.. వచ్చే ఏడాది సుమారు 40 వేల మంది ఫ్రెషర్స్‌ను నియమించుకుంటుందన్నారు. ఐదు లక్షల మందికి పైగా ఫ్రెషర్స్ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకున్నట్లు టీసీఎస్ వెల్లడించింది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health tips | మంచినీళ్లు తక్కువ తాగితేనే కాదు.. మరీ ఎక్కువ తాగినా ఆరోగ్యానికి హానికరమే..!
Nepal PM Balen Shah | భారత్ చేరుకున్న నేపాల్ ప్రధాని.. సోమవారం ప్రధాని మోదీతో చర్చలు
Festivals | పండుగల సమయంలో స్వీట్లను ఎక్కువగా తింటే షుగర్ లెవల్స్ ఎప్పటికీ అలాగే ఉంటాయా..?
JEE Main | ఈ రాత్రి 12 గంటలకు ముగియనున్న గడువు.. ఇప్పటికే 13 లక్షలు దాటిన జేఈఈ దరఖాస్తులు..!
Health tips | మీలో ఈ లక్షణాలుంటే ఆలస్యం చేయకుండా థైరాయిడ్ పరీక్షలు చేయించుకోండి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ

