Saturn | ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానున్నది. అతిపెద్ద అగ్రహాల్లో ఒకటైన శనిగ్రహం భూమికి చేరువగా రాబోతున్నది. దాదాపు మూడు రోజుల పాటు ఖగోళ ప్రియులను శనిగ్రహం కనువిందు చేయబోతున్నది. ఆదివారం నుంచి ఈ నెల 30వ తేదీ వరకు ఆకాశంలో ప్రకాశవంతంగా కనిపించనున్నది. సాధారణ కంటితోనే ఈ గ్రహాన్ని చూసే వీలుంది. టెలీస్కోప్, స్పేస్ బైనాక్యూలర్స్తో మరింత స్పష్టంగా చూసే వీలున్నది. అయితే, సాధారణంగా దీన్ని శాస్త్రవేత్తలు శాటర్న్ అపోజిషన్గా పిలుస్తుంటారు. రెండు గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతున్న సమయంలో పూర్తిగా వ్యతిరేక దశకు చేరుకోవడాన్ని అపోజిషన్గా పిలుస్తుంటారు. శని- సూర్యుడికి మధ్య భూమి వచ్చిన సమయంలో ఇది ఏర్పడుతుంది.
శని గ్రహం సూర్యుడికి 889 మిలియన్ మైల్స్ దూరంలో ఉంటుంది. భూమికి అత్యంత సమీపానికి వచ్చిన సమయంలో సూర్యుడికి, శనిగ్రహానికి మధ్య దూరం 746 మిలియన్ మైల్స్కి తగ్గుతుంది. సౌర కుటుంబంలో భూమి తర్వాత ఆకర్షణీయమైన గ్రహంగా శని. ఈ గ్రహానికి దానికున్న వలయాలే ప్రత్యేక ఆకర్షణ. రాత్రి వేళలో మామూలు కళ్లతో చూసినప్పుడు మిలమిల మెరుస్తూ కనిపిస్తుంటుంది. దీనికి వలయాల్లో ఉన్న మంచుతో కూడిన రాళ్లతో పాటు వాయువులు సైతం ఓ కారణం. భూమి రేడియస్ 6,378.1 చదరపు కిలోమీటర్లు కాగా.. శని రేడియస్ 36,183.7 చదరపు కిలోమీటర్లు. భూమితో పోలిస్తే తొమ్మిది రెట్లు రేడియస్ అధికం. జుపిటర్ తరహాలోనే శనిగ్రహం సైతం హైడ్రోజన్, హీలియంతో నిండి ఉంటుంది. ఇక శనిగ్రహాన్ని నేరుగా చూడాలంటే రాత్రి 8.30 గంటల తర్వాత దక్షిణ ఆగ్నేయం వైపు చూడవచ్చు. ఈ నెల 30 వరకు చంద్రుడికి అత్యంత సమీపంలో శనిగ్రహం కనిపిస్తుంది.
మరో వైపు ఈ గ్రహం పరిశోధనలు చేపట్టేందుకు పలువురు ఖగోళ శాస్త్రవేత్తలు సిద్ధమవుతున్నారు. శనిగ్రహానికి సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ఇదే మంచిసమయమని పేర్కొంటున్నారు. భూమికి దగ్గరగా వస్తుండడంతో శనిగ్రహం లక్షణాలు, ఉపరితల వాతావరణం, దారికి ఉండే రింగ్స్ స్పష్టంగా కనిపిస్తాయని పేర్కొంటున్నారు. మరో వైపు సౌరకుటుంబంలోని గురుగ్రహం, శనిగ్రహం, యురేనస్, నెప్ట్యూన్ వాయు గ్రహాలు కాగా.. ఇవి సంవత్సరంలో ఒకసారి అప్పోజిషన్లోకి వెళ్తాయి. అంగారక గ్రహం ప్రతి 27 నెలలకోసారి అపోజిషన్లోకి వెళ్తుటుంది. శుక్ర, బుధ గ్రహాలు మాత్రం వెళ్లవు. ఇవి ఎప్పుడు భూమి, సూర్యడి మధ్యనే ఉంటాయి.