Samsung Galaxy M32 Prime Edition | భారత్ మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ ఎం32 ప్రైమ్ ఎడిషన్.. ధరెంతంటే?!
Samsung Galaxy M32 Prime Edition | శాంసంగ్ తాజాగా భారత్ మార్కెట్లోకి ‘గెలాక్సీ ఎం32 ప్రైమ్ ఎడిషన్ తీసుకొచ్చింది.
Samsung Galaxy M32 Prime Edition | దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శాంసంగ్ తాజాగా భారత్ మార్కెట్లోకి ‘గెలాక్సీ ఎం32 ప్రైమ్ ఎడిషన్ Galaxy M32 Prime Edition’ తీసుకొచ్చింది. అయితే, గెలాక్సీ ఎం 32 ప్రైమ్ ఎడిషన్ ( Galaxy M32 Prime Edition ) ఫోన్ కేవలం అమెజాన్ వెబ్సైట్లో మాత్రమే వినియోగదారులకు లభ్యం అవుతుంది. ఈ 4జీ స్మార్ట్ ఫోన్ 6000 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీతో వస్తోంది. దీని ధర రూ. 11,499గా నిర్ణయించారు.
గెలాక్సీ ఎం 32 ప్రైమ్ ఎడిషన్ ( Galaxy M32 Prime Edition ) ఫోన్ రెండు స్టోరేజీ వేరియంట్లలో లభ్యం అవుతుంది. 4జీబీ రామ్ ప్లస్ 64జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్ రూ.11,499లకు లభిస్తుంది. 6జీబీ రామ్ ప్లస్ 128జీబీ స్టోరేజీ వేరియంట్ ఫోన్ రూ.13,499లకే లభ్యం అవుతుంది. ఇది ప్రైమ్ బ్లూ, బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
గెలాక్సీ ఎం 32 ప్రైమ్ ఎడిషన్ ( Galaxy M32 Prime Edition ) ఫోన్లో 24 గంటలు ఇంటర్నెట్ యూసేజ్తోపాటు 25 గంటలు వీడియో ప్లే టైం, 130 గంటల మ్యూజిక్ ప్లే టైం, సుమారు 40 గంటల వాయిస్ కాల్స్ ఫెసిలిటీ ఉంది. రెడ్ మీ, ఒప్పో, ఇన్ఫినిక్స్, టెక్నో, మోటొరోలా వంటి లో బడ్జెట్ ఫోన్లకు గెలాక్సీ ఎం 32 ప్రైమ్ ఎడిషన్ ఫోన్ గట్టి పోటీ ఇస్తుంది.
అమెజాన్ ఆఫర్‌తో 4జీబీ రామ్ వేరియంట్ ఫోన్‌ను రూ.9,999లకే పొందొచ్చు. అమెజాన్ ద్వారా కొనుగోలు చేయడంతో మూడు నెలల అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఉచితంగా పొందొచ్చు. గెలాక్సీ ఎం 32 ప్రైమ్ ఎడిషన్ ఫోన్లో అంతకుముందు గెలాక్సీ ఎం 31 ప్రైమ్ ఎడిషన్ ఫోన్లోని ఫీచర్లన్నీ వస్తాయి.
గెలాక్సీ ఎం 32 ప్రైమ్ ఎడిషన్ ( Galaxy M32 Prime Edition ) ఫోన్లో 6.4-అంగుళాల అమోల్డ్ అండ్ ఇనిఫినిటీ -యూ-నాచ్ డిస్ప్లే ఉంటుంది. ఫుల్ హెచ్డీ + రిజొల్యూషన్‌తో మొబైల్ 90హెర్ట్జ్ వద్ద రీఫ్రెష్ అవుతుంది. 18వాట్ల టైప్-సీ అడాప్టర్ విత్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌తో ఈ స్మార్ట్ ఫోన్ చార్జి అవుతుంది.
గెలాక్సీ ఎం 32 ప్రైమ్ ఎడిషన్ ( Galaxy M32 Prime Edition ) ఫోన్లో 64 మెగా పిక్సెల్ (ఎంపీ) రేర్ సైడ్ క్వాడ్ కెమెరా లభ్యం అవుతుంది. సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ వస్తుంది. 20 ఎంపీ ఫ్రంట్ కెమెరాతోపాటు 8-మెగా పిక్సెల్ రేర్ అల్ట్రా వైడ్ లెన్స్ కెమెరా, 2-మెగా పిక్సెల్ మాక్రో కెమెరా, 2-మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్ కూడా ఉంటుంది.
గెలాక్సీ ఎం 32 ప్రైమ్ ఎడిషన్ ఫోన్‌తోపాటు మీడియా టెక్ హెలియో జీ80 చిప్సెట్, ఎస్డీ కార్డు కూడా ఇస్తారు. ఆండ్రాయిడ్ 11 ఓఎస్ వర్షన్‌పై పని చేస్తుంది. 4జీ కనెక్టివిటీతోపాటు డ్యుయల్ సిమ్ సపోర్ట్ కలిగి ఉంటుంది. వై-ఫై, బ్లూటూత్ కనెక్టివిటీ ఉంటుంది. దీంతోపాటు 3.5 ఎంఎం ఆడియో జాక్ ఫెసిలిటీ కూడా పొందొచ్చు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

