న్యూఢిల్లీ : ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ (Amazon) తన ప్లాట్‌ఫాంపై న్యూ రివల్యూషన్ 5జీ సేల్‌ను నిర్వహిస్తుండగా సేల్‌లో భాగంగా పలు మొబైల్ ఫోన్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను ఆఫర్ చేస్తోంది. పేరుకు తగ్గట్టే కేవలం 5జీ ఫోన్లపై అమెజాన్ న్యూ సేల్ ఈవెంట్లో డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.
శాంసంగ్ గెలాక్సీ ఎం14, రెడ్మి కే50ఐ, షియామి 12 ప్రొ, ఐక్యూఓఓ నియో 7 సహా పలు ఫోన్లపై సేల్‌లో ఆకర్షణీయ తగ్గింపును ఆఫర్ చేస్తోంది. ఈ సేల్‌లో బ్యాంక్ కార్డులపై ఆఫర్లతో పాటు కొన్ని ఫోన్లపై ఫ్లాట్ డిస్కౌంట్ అందుబాటులో ఉంది. రూ. 15000లోపు బెస్ట్ 5జీ ఫోన్‌గా పేరొందిన శాంసంగ్ గెలాక్సీ ఎం14 సేల్‌లో రూ. 14,990కి అందుబాటులో ఉంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై రూ. 1500 డిస్కౌంట్ లభిస్తోంది. ఇక 128జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 13,490కి లభిస్తోంది.
ఇక మిడ్ రేంజ్ 5జీ ఫోన్ రెడ్మి కే50ఐ సేల్‌లో డిస్కౌంట్ ధరపై రూ. 20,999కి లభిస్తుండగా ఐసీఐసీఐ బ్యాంక్ కార్డులపై ఈ ఫోన్ 19,999కి అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ను భారత్‌లో రూ. 25,999కి లాంఛ్ చేయగా సేల్‌లో బ్యాంక్ ఆఫర్‌తో కలుపుకుని ఏకంగా రూ. 6000 డిస్కౌంట్ లభిస్తోంది. ఇక ఐక్యూఓఓ నియో 7, షియామి 12 ప్రొ వంటి ప్రీమియం ఫోన్లు సైతం ఆకర్షణీయ డీల్స్‌తో కస్టమర్లకు తగ్గింపు ధరలో అమెజాన్ రివల్యూషన్ 5జీ సేల్‌లో అందుబాటులో ఉన్నాయి.
Read More