Samsung Galaxy F23 5G | సామ్సంగ్ గెలాక్సీ సిరీస్ నుంచి ఎఫ్23 5జీ ఫోన్ లాంచ్‌కు రంగం సిద్ధమైంది. భారత్‌లో మార్చి 8న ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఫ్లిప్‌కార్ట్, అఫిషియల్ సామ్సంగ్ వెబ్సైట్లో ఫోన్‌ను బుక్ చేసుకోవచ్చు. గెలాక్సీ ఎఫ్ సిరీస్‌లోనే బెస్ట్ ఫీచర్లతో ఈ ఫోన్ విడుదల కానుంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 750జీ ఎస్వోసీ, 120 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ విడుదల కానుంది.
ఈ ఫోన్ ధర రూ.20 వేల లోపే ఉండనుంది. గెలాక్సీ ఎఫ్ 22 సిరీస్‌కు కొనసాగింపుగా ఈ ఫోన్ రానుంది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీ బ్యాకప్‌తో ఈ ఫోన్ రానున్నట్టు తెలుస్తోంది. 6 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 12, ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, ఇన్ఫినిటీ వీ డిస్ప్లే లాంటి ఫీచర్లతో గెలాక్సీ ఎఫ్ 23 5జీ ఫోన్ లాంచ్ కానుంది.