న్యూఢిల్లీ : శాంసంగ్ గెలాక్సీ ఏ34, గెలాక్సీ ఏ54 పేరుతో ఇటీవల రెండు ఏ సిరీస్ స్మార్ట్ఫోన్లను లాంఛ్ చేసిన శాంసంగ్ తాజాగా బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌పై కసరత్తు సాగిస్తోంది. అందుబాటు ధరలో గెలాక్సీ ఎఫ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎఫ్14ను (Samsung Galaxy F14) లాంఛ్ చేస్తోంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14ను మార్చి 24న లాంఛ్ చేయనున్నట్టు కంపెనీ అధికారికంగా ప్రకటించింది.
అప్‌కమింగ్ శాంసంగ్ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 10,000 నుంచి రూ . 20,000 మధ్య ఉంటుందని అంచనా. ఎఫ్14 కీలక వివరాలను కంపెనీ టీజర్లో వెల్లడించింది. టీజర్లో పేర్కొన్న వివరాల ప్రకారం శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 13 5జీ బ్యాండ్స్‌ను సపోర్ట్ చేస్తుది.
ఈ స్మార్ట్‌ఫోన్ అండ్రాయిడ్ 13 ఆధారిత వన్ యూఐ 5.0పై రన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఎక్సినాస్ 1330 ఆక్టా కోర్ ఎస్ఓసీ చిప్సెట్తో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫుల్హెచ్డీ+ రిజల్యూషన్‌తో 6.6 ఇంచ్ ఎల్సీడీ స్క్రీన్‌తో కస్టమర్లను ఆకట్టుకోనుంది. ఇక శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 50ఎంపీ ప్రైమరీ కెమెరా, 13 ఎంపీ సెల్ఫీ కెమెరాలతో పాటు 25డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 6000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంటుంది.
Read More :
Samsung Galaxy A34 : దేశీ మార్కెట్లో గెలాక్సీ ఏ 34, గెలాక్సీ ఏ54 లాంఛ్