iPhone 15 | ప్రియం కానున్న ఐఫోన్ 15 ప్రొ మోడల్స్ !
ఈ ఏడాది చివరిలో కస్టమర్ల ముందుకు రానున్న ఐఫోన్ 15 (iPhone 15) సిరీస్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫీచర్లలో కీలక అప్గ్రేడ్లతో ఈ ప్రీమియం ఫోన్లు ఆకట్టుకోనున్నాయి.
న్యూఢిల్లీ : ఈ ఏడాది చివరిలో కస్టమర్ల ముందుకు రానున్న ఐఫోన్ 15 (iPhone 15) సిరీస్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫీచర్లలో కీలక అప్గ్రేడ్లతో ఈ ప్రీమియం ఫోన్లు ఆకట్టుకోనున్నాయి. ఐఫోన్ 15 ప్రొ మోడల్స్ న్యూ సాలిడ్-స్టేట్ బటన్ డిజైన్‌తో రానుండగా ఈ మోడల్స్ ధర అత్యధికంగా ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.లేటెస్ట్ ఐఫోన్స్‌లో భారీ మార్పులు చేపడుతుండటంతో ఐఫోన్ 15 ప్రొ, ఐఫోన్ 15 ప్రొ మ్యాక్స్ మోడల్స్ ధరలు అధికంగా ఉంటాయని టెక్ నిపుణులు జెఫ్ పు పేర్కొన్నారు.
స్టాండర్డ్ మోడల్ సైతం కెమెరా, డిజైన్, ఇతర ఫీచర్లలో కీలక మార్పులతో రానుందని చెబుతున్నారు. ఇప్పటివరకూ వెల్లడైన లీక్స్ ప్రకారం ఐఫోన్ 15 ప్రొ మ్యాక్స్‌లో మెరుగైన ఆప్టికల్ జూమ్ కోసం యాపిల్ న్యూ పెరిస్కోప్ లెన్స్ వాడుతోంది. ప్రొ వేరియంట్లు మెరుగైన ర్యాం, టైటానియం ఫ్రేమ్‌తో కస్టమర్ల ముందుకు రానున్నాయి. న్యూ ఫోన్లలో యాపిల్ లేటెస్ట్ ఏ17 బయోనిక్ చిప్‌సెట్‌ను వాడనుంది.
ఈ ఫీచర్లు, ఇతర అప్డేట్ల కారణంగా అప్‌కమింగ్ ఐఫోన్ల ధరలు పెరగనున్నాయి. మరోవైపు న్యూ ఫోన్లను వరుసగా రెండేండ్ల పాటు పాత ధరలకే యాపిల్ ఆఫర్ చేయడంతో ఈసారి ధరల పెంపునకు కంపెనీ మొగ్గుచూపవచ్చని చెబుతున్నారు. ధర, ఫీచర్ల పరంగా స్టాండర్డ్, ప్రొ మోడల్స్ మధ్య భారీ వ్యత్యాసం ఉండేలా యాపిల్ వ్యవహరించనుంది. గత ఏడాది మోడల్స్‌తో పోలిస్తే ఐఫోన్ 15 ప్రొ మోడల్స్ ధరలు అధికంగా ఉండనున్నాయి.
Read More :
Samsung Galaxy A34 : దేశీ మార్కెట్లో గెలాక్సీ ఏ 34, గెలాక్సీ ఏ54 లాంఛ్
AI bot | గేమింగ్ కంపెనీ సీఈఓగా ఏఐ బాట్ నియామకం
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rashmika | విజయ్ను 100 కాదు.. 1000 సార్లు ప్రపోజ్ చేస్తా.. ట్రోలర్లకు రష్మిక గట్టి సమాధానం!
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
‘గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలి’
AP News | అవి ఏకగ్రీవాలు కాదు.. కూటమి సర్కారు బలాత్కారాలు : వైఎస్ షర్మిల
Robbery | పుణ్యక్షేత్రానికి వెళ్లిన ఫ్యామిలీ.. రాత్రి కారులో హైదరాబాద్‌కు తిరిగొస్తుంటే..
ట్రెండింగ్ వార్తలు
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?

