AI bot | గేమింగ్ కంపెనీ సీఈఓగా ఏఐ బాట్ నియామకం
హాంకాంగ్‌కు చెందిన గేమింగ్ కంపెనీ తమ సీఈఓగా ఏకంగా ఏఐ బాట్‌ను (AI bot) నియమించింది. నెట్‌డ్రాగన్ వెబ్‌సాఫ్ట్‌కు టాంగ్ యూ అనే ఏఐ బాట్‌ను సీఈఓగా కంపెనీ నియమించింది.
న్యూఢిల్లీ : చాట్‌జీపీటీ వంటి ఏఐ చాట్బాట్లు టెక్ ప్రపంచంలో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. చాట్‌జీపీటీపై హాట్ డిబేట్ సాగుతుండగా హాంకాంగ్‌కు చెందిన గేమింగ్ కంపెనీ తమ సీఈఓగా ఏకంగా ఏఐ బాట్‌ను (AI bot) నియమించింది. నెట్‌డ్రాగన్ వెబ్‌సాఫ్ట్‌కు టాంగ్ యూ అనే ఏఐ బాట్‌ను సీఈఓగా కంపెనీ నియమించింది. కంపెనీ రాబడిని పెంచడంలో ఏఐ బాట్ సహకరించడం చర్చకు తావిస్తోంది. ఏఐ బాట్ సీఈఓగా కంపెనీ పగ్గాలు చేపట్టిన తర్వాత రాబడి పెరగడంతో పాటు స్టాక్ మార్కెట్ కూడా కొత్తపుంతలు తొక్కుతోంది.
హాంకాంగ్ స్టాక్ మార్కెట్లో జోష్ నెలకొనడం ఆశ్చర్యపరుస్తోంది. నిర్వహణా సామర్ధ్యాన్ని సరికొత్త స్ధాయికి తీసుకువెళ్లడంతో పాటు కార్పొరేట్ మేనేజ్మెంట్లో ప్రక్షాళన దిశగా ఏఐ వినియోగాన్ని పెంచేందుకు ఏఐ చాట్‌బాట్‌ను అత్యున్నత స్ధానంలో నియమించినట్టు నెట్‌డ్రాగన్ వెబ్‌సాఫ్ట్ పేర్కొంది. నాయకత్వ స్ధాయిలో నిర్ణయాలు తీసుకోవడం, హైలెవెల్ అనలిటిక్స్ సమీక్షించడం, రిస్క్‌లను అంచనా వేయడం వంటి కీలక బాధ్యతలను ఏఐ సీఈఓ టాంగ్ యూకు గేమింగ్ కంపెనీ అప్పగించింది.
ఎలాంటి వేతనం లేకుండా వారానికి ఏడు రోజులు, రోజుకు 24 గంటలు పనిచేసే కంపెనీ తొలి సీఈఓ టాంగ్ యూ కావడం గమనార్హం. ఏఐ చాట్‌బాట్‌ను సీఈఓగా నియమించడం ద్వారా నైపుణ్యాల అభివృద్ధి, ఉద్యోగులందరికీ మెరుగైన పని ప్రదేశాన్ని సృష్టించడంలో మెరుగైన ఫలితాలు రాబట్టవచ్చని కంపెనీ ఆశిస్తోంది. టాంగ్ యూ నియామకంతో కంపెనీ ఏఐ ప్లస్ మేనేజ్మెంట్ వ్యూహాలకు పదునుపెట్టడంతో పాటు మెటావర్స్ సంస్ధగా కంపెనీని మలిచేందుకు దోహదపడుతుంది.
Read More :
ChatGPT | చాట్‌జీపీటీకి పోటీగా క్లాడ్ : ఓపెన్ఏఐ మాజీ ఉద్యోగుల ఆవిష్కరణ
Meta Layoffs | దారుణంగా మాంద్యం పరిస్థితులు.. మలి విడుత ఉద్వాసనకు మెటా సిద్ధం.. 10 వేల మంది ఇంటికే..?!
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

