Chandrayaan-3 | చంద్రుడి దక్షిణ ధ్రువంవైపు వెళ్తున్న చంద్రయాన్-3.. ఆ భాగంలో ల్యాండింగ్ చేయడం అసాధ్యమా?
Chandrayaan-3 | దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత మళ్లీ చంద్రుడిని ముద్దాడాలన్న రష్యా కల చెదిరింది. జాబిల్లిపై పరిశోధనల కోసం రష్యా ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన లూనా-25 ప్రయోగం విఫలమైంది.
Chandrayaan-3 | మాస్కో, ఆగస్టు 20: దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత మళ్లీ చంద్రుడిని ముద్దాడాలన్న రష్యా కల చెదిరింది. జాబిల్లిపై పరిశోధనల కోసం రష్యా ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన లూనా-25 ప్రయోగం విఫలమైంది. సాంకేతిక లోపం కారణంగా లూనా-25 ల్యాండర్ కుప్పకూలింది. జాబిల్లి సమీపంలోకి వెళ్లిన ల్యాండర్, అనియంత్రిత కక్ష్యలో పరిభ్రమించి, అనంతరం చంద్రుడి ఉపరితలాల్లి ఢీకొట్టి కూలిపోయిందని రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్కాస్మోస్ అధికారికంగా ధ్రువీకరించింది. ‘ప్రి-ల్యాండింగ్ కక్ష్యలోకి ప్రవేశపెట్టే విన్యాసం సందర్భంగా ఆటోమేటిక్ స్టేషన్లో అసాధారణ పరిస్థితి ఏర్పడింది. నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వ్యోమనౌకతో సంబంధాలు తెగిపోవడంతో క్రాష్ ల్యాండ్ అయి ల్యాండర్ చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొంది’ అని రోస్కాస్మోస్ టెలిగ్రామ్‌లో పోస్టు చేసింది.
దక్షిణ భాగంపై ల్యాండింగ్ అసాధ్యమా?
47 ఏండ్ల అనంతరం రష్యా చేపట్టిన లూనా-25 ప్రయోగాన్ని ఆగస్టు 10న వోస్తోచ్ని కాస్మోడ్రోమ్ నుంచి ప్రయోగించారు. 1,750 కిలోలు మాత్రమే బరువు ఉండే ఇది అతి తక్కువ సమయంలోనే చంద్రుడి ఉపరితలంపై కాలు మోపేలా డిజైన్ చేశారు. అధిక ఇంధన సామర్థ్యం కారణంగా సుమారు 11 రోజుల్లోనే జాబిల్లిని చేరుకునేలా ప్లాన్ చేశారు. ఆగస్టు 21న చంద్రుడి దక్షిణ ధ్రువానికి సమీపంలో దీన్ని ల్యాండ్ చేసేలా రష్యా ప్రణాళికలు రచించింది. అయితే సాంకేతిక లోపం కారణంగా అనుకున్నదాని కంటే ఒక రోజు ముందుగానే క్రాష్ ల్యాండ్ అవడంతో ప్రయోగం విఫలమైంది. సోవియట్ యూనియన్ ఆధ్వర్యంలో 1976లో రష్యా చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్‌ను విజయవంతంగా ల్యాండ్ చేసింది. ఇప్పటివరకు అమెరికా, చైనా, సోవియట్ యూనియన్ మాత్రమే జాబిల్లిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసినప్పటికీ అవన్నీ చంద్రుడి ఈక్వేటర్ వద్ద ల్యాండింగ్ చేశాయి. ఇప్పటి వరకు దక్షిణ భాగంపై ఏ దేశం ల్యాండర్‌ను సాఫ్ట్‌ల్యాండింగ్ చేయలేదు. దీంతో అక్కడ ల్యాండింగ్ చేయడం అసాధ్యమా? అనే సందేహాలు కలుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-3 చంద్రుడి దక్షిణ ధ్రువం లక్ష్యంగా పరుగులు తీస్తున్నది.
కవరేజీ కేవలం 26 సెకండ్లే
లూనా-25 ప్రయోగం విఫలమైన ఘటనకు రష్యా అధికారిక మీడియా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వలేదు. రష్యా ప్రభుత్వ అధికారిక మీడియా అయిన ది రష్యన్ స్టేట్ న్యూస్ ఏజెన్సీ (టీఏఎస్ఎస్) క్రాష్ ల్యాండింగ్ వార్తను మరుగున పడేసింది. మధ్యాహ్నం ప్రసారమైన బులెటిన్‌లో దీనికి ఎనిమిదో స్థానం కేటాయించారు. 26 సెకండ్ల పాటు మాత్రమే ఈ వార్తను ప్రసారం చేయడం గమనార్హం. స్పెయిన్‌కు చెందిన టెనెరైఫ్ దీవుల వార్తకు ఇచ్చిన ప్రాధాన్యం కూడా క్రాష్ ల్యాండింగ్ వార్తకు ఇవ్వలేదు. మరోవైపు రష్యాకు చెందిన పైలట్, విమాన సిబ్బంది సెలవుల సంబంధిత అంశాన్ని 4 నిమిషాల పాటు ప్రసారం చేయడం గమనార్హం.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

