Reliance Jio | టెలికాం దిగ్గజ సంస్థ రిలయన్స్ జియో తన కస్టమర్లకు బంపర్ ఆఫర్‌ను ప్రకటించింది. గూగుల్‌కు చెందిన జెమిని ఏఐ ప్రొ సబ్ స్క్రిప్షన్ ను తన వినియోగదారులందరికీ ఉచితంగా అందిస్తున్నట్లు తెలియజేసింది. ఇటీవలే ఈ ఆఫర్‌ను కేవలం యువతకు మాత్రమే అందిస్తున్నట్లు జియో తెలియజేసింది. కానీ ప్రస్తుతం ఈ ఆఫర్‌ను తమ వినియోగదారులు అందరికీ విస్తరిస్తున్నట్లు తెలిపారు. గూగుల్‌తో భాగస్వామ్యం అయిన రిలయన్స్ జియో ఈ బంపర్ ఆఫర్‌ను అందిస్తున్నట్లు తెలియజేసింది. ఇందులో భాగంగా గూగుల్‌కు చెందిన జెమిని ఏఐ ప్రొ సబ్ స్క్రిప్షన్ ను జియో వినియోగదారులు ఏకంగా 18 నెలల పాటు ఉచితంగా వాడుకోవచ్చు. ఇందులో వినియోగదారులకు గూగుల్ జెమిని ప్రొ ప్లాన్ వస్తుంది.
ఈ ఆఫర్లో భాగంగా గూగుల్‌కు చెందిన అధునాతన ఏఐ మోడల్‌ను జియో వినియోగదారులు ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఈ ఆఫర్ విలువ రూ.35,100 అని జియో తెలియజేసింది. జియో అన్లిమిటెడ్ 5జి యూజర్లు అందరికీ ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపారు. గతంలో అక్టోబర్ 30 నుంచి ఈ ఆఫర్‌ను జియో కేవలం యూత్‌కు మాత్రమే అందజేసింది. 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారికి మాత్రమే ఈ ఆఫర్‌ను అందిస్తున్నామని జియో వెల్లడించింది. కానీ 20 రోజుల తరువాత ఈ ఆఫర్‌ను అందరికీ వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా గూగుల్‌కు చెందిన కట్టింగ్ ఎడ్జ్ ఏఐ టూల్స్‌ను జియో వినియోగదారులు ఉచితంగా వాడుకునే సౌలభ్యం ఉంటుంది.
ఈ ఆఫర్‌ను 18 నెలల పాటు అందిస్తున్నామని జియో ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. దీన్ని తమ కస్టమర్లకు కాంప్లిమెంటరీగా అందిస్తున్నట్లు వివరించారు. గూగుల్ జెమిని 3 మోడల్‌కు చెందిన ఏఐ టూల్స్‌ను ఉచితంగా వాడుకోవచ్చని అన్నారు. దీంట్లో భాగంగా అత్యంత శక్తివంతమైన, సంక్లిష్టమైన పనులను కూడా ఏఐ సహాయంతో నిర్వహించుకోవచ్చని అన్నారు. ఈ ఆఫర్ కాల పరిమితి వరకు వినియోగదారులకు ఉచితంగా 2 టీబీ గూగుల్ వన్ ప్రీమియం స్టోరేజ్ లభిస్తుందని, దీన్ని గూగుల్ డ్రైవ్, ఫొటోలు, జీమెయిల్, కంటెంట్ క్రియేషన్ కోసం వాడుకోవచ్చని తెలిపారు. యూజర్లు అధునాతన, హై క్వాలిటీ ఇమేజ్‌లు లేదా వీడియోలను క్రియేట్ చేసుకుని ఈ స్టోరేజ్‌లో సేవ్ చేసుకోవచ్చని తెలిపారు.
ఈ ఆఫర్లో భాగంగా గూగుల్ జెమిని ఏఐ ప్రొ సబ్ స్క్రిప్షన్ సహాయంతో యూజర్లు గూగుల్‌కు చెందిన నానో బనానా, వియో 3.1 వంటి ఇమేజ్, వీడియో జనరేటింగ్ టూల్స్‌ను ఉచితంగా వాడుకోవచ్చు. సాధారణంగా ఈ టూల్స్‌ను వాడుకోవాలంటే జెమిని ఏఐ ప్రొ సబ్ స్క్రిప్షన్ ను తీసుకోవాలి. దీనికి నెలకు సుమారుగా రూ.2వేలకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. కానీ జియో అందిస్తున్న ఈ ఆఫర్‌ను వాడుకుంటే ఈ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగానే పొందవచ్చు. ఇది 18 నెలల పాటు ఉచితంగా లభిస్తుంది. ఇక ఈ ఆఫర్ పొందేందుకు గాను జియో వినియోగదారులు తమ ఫోన్లో ఉన్న మై జియో యాప్‌కు వెళ్లాలి. దాన్ని ఓపెన్ చేసిన అనంతరం హోమ్ స్క్రీన్‌లో పై భాగంలో ఉండే ఆఫర్‌ను ట్యాప్ చేయాలి. అనంతరం వచ్చే విండోలో క్లెయిమ్ నౌ అనే బ్యానర్ పై టచ్ చేయాలి. దీంతో యూజర్లు ఇచ్చే మెయిల్ ఐడీకి ఈ ఆఫర్ యాక్టివేట్ అవుతుంది. అనంతరం ఆ మెయిల్ ఐడీ సహాయంతో గూగుల్ జెమిని ఏఐ ప్రొ సబ్ స్క్రిప్షన్ ను ఉచితంగా వాడుకోవచ్చు. ఎయిర్టెల్ అందిస్తున్న పర్ప్లెక్సిటీ ఏఐ ప్రొ సబ్ స్క్రిప్షన్ కు జియో అందిస్తున్న ఈ సబ్ స్క్రిప్షన్ గట్టి పోటీనిస్తుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.