REDMI Pad 2 | ఆకట్టుకునే ఫీచర్లతో తక్కువ ధరకే ఆండ్రాయిడ్ ట్యాబ్‌ను కొనాలని చూస్తున్నారా..? అయితే మీకోసమే షియోమీ ఓ నూతన ట్యాబ్‌ను లాంచ్ చేసింది. రెడ్మీ ప్యాడ్ 2 పేరిట షియోమీ కంపెనీ భారత్ లో ఓ నూతన ఆండ్రాయిడ్ ట్యాబ్‌ను విడుదల చేసింది. వైఫై, సెల్యులార్ వేరియెంట్లలో దీన్ని లాంచ్ చేశారు. ఇది చాలా స్లిమ్‌గా తక్కువ బరువును కలిగి ఉండడం విశేషం. ఈ ట్యాబ్‌లో 11 ఇంచుల 2.5కె డిస్ప్లేను ఏర్పాటు చేయగా దీనికి 90 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల డిస్ ప్లే చాలా క్వాలిటీగా ఉంటుందని చెప్పవచ్చు. నాణ్యమైన దృశ్యాలను వీక్షించవచ్చు. సూర్యకాంతిలోనూ చక్కగా కనిపించేలా 600 నిట్స్ బ్రైట్ నెస్‌ను అందిస్తున్నారు. లో బ్లూ లైట్, ఫ్లికర్ ఫ్రీ వంటి ఫీచర్లను ఈ డిస్ప్లే కలిగి ఉంది. ఇందులో రీడింగ్ మోడ్, టచ్ ఆన్ వెట్, ఫ్లికర్ ఫ్రీ డిమ్మింగ్ వంటి ఫీచర్లను కూడా ఏర్పాటు చేశారు.
ఈ ట్యాబ్‌లో మీడియాటెక్ హీలియో జి100 అల్ట్రా చిప్‌ను అమర్చారు. 8జీబీ ర్యామ్ లభిస్తుంది. ర్యామ్‌ను వర్చువల్‌గా మరో 8జీబీ వరకు పెంచుకోవచ్చు. 256 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందిస్తున్నారు. మెమొరీని కార్డు ద్వారా 2 టీబీ వరకు పెంచుకోవచ్చు. ఇందులో 9000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి ఫాస్ట్ చార్జింగ్‌ను అందిస్తున్నారు. యూఎస్బీ టైప్ సి పోర్టు ద్వారా చార్జింగ్ పెట్టుకోవచ్చు. బ్యాటరీ ఈ ట్యాబ్‌కు ఉన్న ప్రధాన ఆకర్షణగా చెప్పవచ్చు. ఈ ట్యాబ్‌లో డాల్బీ అట్మోస్ ఫీచర్ కూడా లభిస్తుంది. అందువల్ల సౌండ్ క్వాలిటీ చాలా బాగుంటుందని చెప్పవచ్చు. 3.5ఎంఎం ఆడియో జాక్‌కు సపోర్ట్‌ను ఇస్తున్నారు. వెనుక వైపు 8 మెగాపిక్సల్ కెమెరా ఉండగా, ముందు వైపు 5 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు.
ఈ ట్యాబ్ రెడ్మీ స్మార్ట్ పెన్కు సపోర్ట్‌ను ఇస్తుంది. వైఫై 5, బ్లూటూత్ 5.3, సెల్యులార్ మోడల్లో 4జి, జీపీఎస్ వంటి ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ట్యాబ్‌లో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత హైపర్ ఓఎస్ 2 వినియోగదారులకు లభిస్తుంది. ఈ ట్యాబ్‌లో ఫేస్ అన్‌లాక్, సర్కిల్ టు సెర్చ్, జెమిని ఏఐ వంటి ఫీచర్లను అందిస్తున్నారు. ఈ ట్యాబ్ కు చెందిన వైఫై వేరియెంట్ 4జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్లో లభిస్తుండగా, సెల్యులార్ వేరియెంట్ 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్స్‌లో లభిస్తుంది. ఈ ట్యాబ్‌తోపాటు యూజర్లు చార్జర్‌ను కూడా బాక్స్‌లో పొందవచ్చు.
షియోమీ రెడ్మీ ప్యాడ్ 2 స్కై బ్లూ, గ్రాఫైట్ గ్రే కలర్ ఆప్షన్లలో విడుదల కాగా ఈ ట్యాబ్‌ను ఎంఐ ఆన్లైన్ స్టోర్‌తోపాటు, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లలోనూ కొనుగోలు చేయవచ్చు. జూన్ 24 నుంచి ఆఫ్‌లైన్ స్టోర్స్‌లోనూ ఈ ట్యాబ్‌ను విక్రయించనున్నారు. ఈ ట్యాబ్‌కు చెందిన వైఫై వేరియెంట్ 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.13,999 ఉండగా, 6జీబీ ర్యామ్, 128జీబీ సెల్యులార్ మోడల్ ధర రూ.15,999గా ఉంది. అలాగే 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ సెల్యులార్ మోడల్ ధర రూ.17,999గా ఉంది. ఈ ట్యాబ్‌కు చెందిన కవర్ ధర రూ.1299 ఉండగా, స్మార్ట్ పెన్ను రూ.3,999 కు విక్రయిస్తున్నారు. లాంచింగ్ కింద హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డులతో ఈ ట్యాబ్‌ను కొనుగోలు చేస్తే రూ.1000 వరకు డిస్కౌంట్ పొందవచ్చు.