Redmi Note 12 Turbo | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ రెడ్మీ త్వరలో తన `నోట్ 12` సిరీస్‌లోనే అత్యంత శక్తిమంతమైన స్మార్ట్ ఫోన్ `రెడ్మీ నోట్ 12 టర్బో (Redmi Note 12 Turbo) త్వరలో మార్కెట్లో ఆవిష్కరించనున్నది. ఇటీవల `నోట్ 12` సిరీస్‌లో పలు ఫోన్లను చైనా, భారత్ మార్కెట్లలోకి తీసుకొచ్చాక గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించింది రెడ్ మీ. రెడ్ మీ నోట్ 12 టర్బో ఫోన్ ఓఎల్ఈడీ (OLED) డిస్ప్లేతో ఒక టిగాబైట్ ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యం కలిగి ఉంటుందని రెడ్మీ ధృవీకరించింది. ఈ నెల 28న మార్కెట్లోకి ఎంట్రీ కానున్నది రెడ్మీ నోట్ 12 టర్బో అని చైనా సోషల్ మీడియా సంస్థ వైబోలో పోస్టర్లు వెలువడ్డాయి.