న్యూఢిల్లీ : షియోమి సబ్ బ్రాండ్ రెడ్మి భారత్‌లో జనవరి 5న రెడ్మి నోట్ 12 ప్రొను లాంఛ్ చేయనున్నట్టు నిర్ధారించింది. 200 ఎంపీ కెమెరాతో రూపొందిన రెడ్మి నోట్ 12 ప్రొ ప్లస్‌తో కలిపి రెడ్మి నోట్ 12 ప్రొ కస్టమర్ల ముందుకు రానుంది. రెడ్మి నోట్ 12 ప్రొ ఓఐఎస్ ఆధారిత (ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్) ప్రైమరీ కెమెరాతో రానుంది. షియోమి రెడ్మి నోట్ 12 ప్రొ సిరీస్‌ను అక్టోబర్ 28న చైనాలో విడుదల చేసింది.
గ్లోబల్ వేరియంట్స్ తరహాలోనే భారత్‌లో ఎంట్రీ ఇచ్చే వేరియంట్ల ఫీచర్లు ఉంటాయని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇక దేశీ మార్కెట్లోకి రానున్న రెడ్మి నోట్ 12 ప్రొ 6.67 ఇంచ్ ఓఎల్ఈడీ డిస్ప్లేతో మెరుగైన వ్యూయింగ్ అనుభూతి కోసం డాల్బీ విజన్ టెక్నాలజీని సపోర్ట్ చేస్తుందని భావిస్తున్నారు.
రెడ్మి నోట్ 12 మీడియాటెక్ డైమెన్సిటీ 1080 చిప్సెట్తో 12జీబీ ర్యాం + 256 జీబీ స్టోరేజ్‌తో రానుంది. రెడ్మి నోట్ లేటెస్ట్ సిరీస్ 67డబ్ల్యూ చార్జింగ్ సపోర్ట్‌తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంటుంది. ఇక రెడ్మి నోట్ 12 ప్రొ ప్లస్ 200డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది. ఇక 5జీ కనెక్టివిటీ కలిగిన రెడ్మి నోట్ 12 సిరీస్ రూ . 19,300 నుంచి అందుబాటులో ఉంది. రెడ్మి నోట్ 12 ప్రొ ప్లస్ ధర రూ. 30,000 వరకూ ఉండవచ్చని అంచనా.