Realme Narzo 50A and 50i : రియల్మీ నుంచి సరికొత్త ఫోన్లు.. ధర, ఫీచర్లు తెలిస్తే వెంటనే కొనేస్తారు
రియల్మీ నుంచి సరికొత్త ఫోన్లు | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్మీ తాజాగా రెండు సరికొత్త ఫోన్లను విడుదల చేసింది
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్మీ తాజాగా రెండు సరికొత్త ఫోన్లను విడుదల చేసింది. నార్జో సిరీస్‌లో 50ఏ, 50ఐ స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. వాటితో పాటు.. రియల్మీ బ్యాండ్ 2 ఫిట్నెస్ బ్యాండ్, 32 ఇంచ్ స్మార్ట్ టీవీ నియోను విడుదల చేసింది. రియల్మీ 50ఏ, 50ఐ సరికొత్త ఫీచర్లతో, బడ్జెట్ ధరలో భారత మార్కెట్లోకి విడుదల అయ్యాయి.

ధర ఎంత?
రియల్మీ నార్జో 50ఏలో రెండు వేరియంట్లు విడుదల అయ్యాయి. 4జీబీ ర్యామ్ ప్లస్ 64 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌తో వచ్చిన ఫోన్ ధర రూ.11,499 కాగా.. 4 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌తో వచ్చిన ఫోన్ ధర రూ.12,499. ఆక్సిజన్ బ్లూ, ఆక్సిజన్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
రియల్మీ నార్జో 50ఐలో కూడా రెండు వేరియంట్ల ఫోన్లు విడుదలయ్యాయి. 2 జీబీ ర్యామ్ ప్లస్ 32 జీబీ స్టోరేజ్ ఆప్షన్‌తో విడుదలయిన ఫోన్ ధర రూ.7499 కాగా.. 4 జీబీ ప్లస్ 64 జీబీ వేరియంట్‌తో విడుదలయిన ఫోన్ ధర రూ.8499 గా ఉంది. ఇందులోనూ మింట్ గ్రీన్, బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
స్పెసిఫికేషన్లు ఇవే
రియల్మీ నార్జో 50ఏ ఆండ్రాయిడ్ 11 ఆధారంగా విడుదల కానుంది. 6.5 ఇంచ్ హెచ్డీ ప్లస్ వాటర్‌డ్రాప్ నాట్చ్ డిస్ప్లే, 88.7 స్క్రీన్ టు బాడీ రేషియో, మీడియాటెక్ హీలియో జీ85 ఎస్వోసీ ప్రాసెసర్, 256 జీబీ వరకు పెంచుకునే మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్, 50 ఎంపీ రేర్ కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్, డ్యుయల్ బాండ్ వైఫై, జీపీఎస్, బ్లూటూత్ వీ5, డ్యుయల్ సిమ్ స్లాట్స్ లాంటి ఫీచర్లతో రియల్మీ నార్జో 50ఏ ఫోన్ విడుదలైంది.

రియల్మీ నార్జో 50ఐ ఫోన్ 6.5 ఇంచ్ డిస్ప్లే, 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, మైక్రోఎస్డీ కార్డ్ స్లాట్(256 జీబీ) వరకు, 8 ఎంపీ రేర్ కెమెరా, 5 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 3.5 ఎంఎం ఆడియో జాక్, మైక్రో యూఎస్బీ పోర్ట్, వైఫై 802, బ్లూటూత్ వీ4.2 లాంటి ఫీచర్లతో రియల్మీ నార్జో 50ఐ ఫోన్ విడుదలైంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
iPhone 13 : ఐఫోన్ 13 సేల్స్ ప్రారంభం.. బుకింగ్ ఎలా? ఔట్లెట్స్ ఎక్కడ ఉన్నాయి?
Redmi 9 Activ : రెడ్మీ 9 యాక్టివ్, 9ఏ స్పోర్ట్ సేల్స్ ప్రారంభ తేదీ ఫిక్స్.. స్పెసిఫికేషన్లు ఇవే
Samsung Galaxy M52 5G : సామ్సంగ్ గెలాక్సీ ఎం52 5జీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ధర, ఫీచర్ల వివరాలు
Vivo X70 : వివో ఎక్స్70 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు ఇవే
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
Sreeleela | శ్రీలీల సంచలన నిర్ణయం.. రెమ్యునరేషన్ తగ్గించుకుంటోందా, వరుస ఫ్లాపుల ఎఫెక్ట్‌తో కొత్త ప్లాన్!
Diabetes | డయాబెటిస్తో పళ్లు ఊడిపోతాయా?.. ఈ 6 సమస్యలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

