Samsung Galaxy F42 5G : మీడియాటెక్ ప్రాసెసర్‌తో రానున్న సామ్సంగ్ గెలాక్సీ ఎఫ్42.. రిలీజ్ డేట్ ఫిక్స్
మీడియాటెక్ ప్రాసెసర్‌తో రానున్న సామ్సంగ్ గెలాక్సీ ఎఫ్42 | ప్రముఖ స్మార్ట్‌ఫోన్, ఎలక్ట్రానిక్స్ తయారీ బ్రాండ్ సామ్సంగ్ త్వరలోనే మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను
ప్రముఖ స్మార్ట్‌ఫోన్, ఎలక్ట్రానిక్స్ తయారీ బ్రాండ్ సామ్సంగ్.. త్వరలోనే మరో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఇండియా మార్కెట్లోకి విడుదల చేయబోతోంది. ఇప్పటికే సామ్సంగ్.. గెలాక్సీ సిరీస్ నుంచి వస్తున్న ఎం52 5జీ ఫోన్‌ను సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. అదే గెలాక్సీ సిరీస్ నుంచి ఎఫ్ 42 మోడల్ 5జీ ఫోన్‌ను సెప్టెంబర్ 29న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించింది.

ఇప్పటికే ఈ ఫోన్‌కు సంబందించిన ఫీచర్లను కూడా కంపెనీ విడుదల చేసింది. గెలాక్సీ ఎఫ్42 5జీ ఫోన్లో ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 90 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్, ట్రిపుల్ కెమెరా సెటప్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 12 5జీ బ్యాండ్స్ లాంటి ఫీచర్లు ఈ ఫోన్లో ఉంటాయి.

సామ్సంగ్ ఎఫ్ సిరీస్‌లో వస్తున్న మొదటి 5జీ ఫోన్, 2021 లో లాంచ్ చేసే ఐదో ఎఫ్ సిరీస్ ఫోన్ ఇది. ఫోన్ విడుదల అయిన రోజు అంటే సెప్టెంబర్ 29న మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ లేదా ఇతర రిటైల్ ఔట్‌లెట్స్‌లో కొనుగోలు చేయొచ్చు. ప్రస్తుతానికి ఈ సిరీస్‌లో బ్లాక్, బ్లూ కలర్స్ వేరియంట్లో ఫోన్ విడుదల కానుంది.
సామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 42 ఫీచర్లు ఇవే
ఫుల్ హెచ్డీ ప్లస్ ఇన్ఫినిటీ వీ డిస్ప్లే, వాటర్‌డ్రాప్ స్టైల్ నాట్చ్ సెల్ఫీ కెమెరా, 90 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్, మీడియాటెక్ డైమెన్సిటీ 700 ఎస్వోసీ, 12 5జీ బ్యాండ్స్.. N1 (2100), N3 (1800), N5 (850), N7 (2600), N8 (900), N20 (800), N28 (700), N66 (AWS-3), N38 (2600), N40 (2300), N41 (2500), N78 (3500), ట్రిపుల్ రేర్ కెమెరా, ఎల్ఈడీ ఫ్లాష్, 64 ఎంపీ రేర్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫింగర్ ప్రింట్ స్కానర్, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, మైక్రోఫోన్, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ లాంటి ఫీచర్లతో సామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 42 రిలీజ్ కానుంది.

లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Samsung Galaxy M52 5G : సామ్సంగ్ గెలాక్సీ ఎం52 5జీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ధర, ఫీచర్ల వివరాలు
Vivo X70 : వివో ఎక్స్70 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు ఇవే
iOS 15 : యాపిల్ ఐవోఎస్ 15 కొత్త అప్డేట్ సరికొత్త ఫీచర్లు ఏంటి? ఏ మోడల్స్‌లో డౌన్లోడ్ అవుతుంది?
Xiaomi 11 Lite NE 5G: అద్భుతమైన ఫీచర్లతో జియోమీ 11 లైట్ ఎన్ఈ ఫోన్.. ధర, లాంచ్ డేట్ లీక్
iPhone 13: ఈ దేశాల్లో ఐఫోన్ 13 చాలా చీప్ గురూ.. ఇండియాలో కన్నా అక్కడ తక్కువ ధరకే ఐఫోన్
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

