iPhone 13 : ఐఫోన్ 13 సేల్స్ ప్రారంభం.. బుకింగ్ ఎలా? ఔట్లెట్స్ ఎక్కడ ఉన్నాయి?
ఐఫోన్ 13 సేల్స్ ప్రారంభం | ఐఫోన్ 13ను త్వరలోనే ఐఫోన్ లవర్స్ చేతుల్లో ఇక చూడబోతున్నాం. ఈరోజు నుంచే అంటే సెప్టెంబర్ 24

హమ్మయ్య.. ఐఫోన్ 13ను త్వరలోనే ఐఫోన్ లవర్స్ చేతుల్లో ఇక చూడబోతున్నాం. ఈరోజు నుంచే అంటే సెప్టెంబర్ 24, శుక్రవారం నుంచే ఐఫోన్ 13 సేల్స్ ప్రారంభం అయ్యాయి. ఇవాళ ఉదయం 8 గంటల నుంచే సేల్స్ ప్రారంభం అయినట్టు యాపిల్ కంపెనీ ప్రకటించింది. యాపిల్ స్టోర్ ఆన్లైన్, ఇతర ఈ కామర్స్ సైట్లలో యాపిల్ ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లను బుక్ చేసుకోవచ్చు.

ఐఫోన్ 13లో భాగంగా ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 13 మినీ ఫోన్లు సేల్లో ఉండనున్నాయి. ఇండియాతో పాటు.. ఆస్ట్రేలియా, కెనడా, చైనా, జర్మనీ, జపాన్, యూకే, యూఎస్తో పాటు మరో 30 దేశాల్లో ఐఫోన్ 13 సేల్స్ ఈరోజు నుంచే ప్రారంభం అయ్యాయి.

ఆన్లైన్లో కాకుండా.. ఆఫ్లైన్లో కొనాలనుకునే కస్టమర్లు.. ఇండియా వ్యాప్తంగా ఉన్న విజయ్ సేల్స్, రిలయెన్స్ డిజిటల్, క్రోమో స్టోర్లలో కొనుగోలు చేయొచ్చు. ఇంతకుముందే ప్రీ ఆర్డర్ చేసుకున్న కస్టమర్లకు ఈరోజు నుంచి ఫోన్ను డెలివరీ చేస్తారు.

ఐఫోన్ 13 బేసిక్ వేరియంట్ ధర రూ.79,900 కాగా.. ఐఫోన్ 13 ప్రో 1 టీబీ వేరియంట్ ధర రూ.1,69,900గా ఉంది. ఐఫోన్ 13 ప్రో 128 జీబీ వేరియంట్ ధర రూ. 1,19,900, 256 జీబీ వేరియంట్ ధర రూ.1,29,900. 512 జీబీ స్టోరేజ్ ధర రూ.1,49,900.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Redmi 9 Activ : రెడ్మీ 9 యాక్టివ్, 9ఏ స్పోర్ట్ సేల్స్ ప్రారంభ తేదీ ఫిక్స్.. స్పెసిఫికేషన్లు ఇవే
Samsung Galaxy M52 5G : సామ్సంగ్ గెలాక్సీ ఎం52 5జీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ధర, ఫీచర్ల వివరాలు
Vivo X70 : వివో ఎక్స్70 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్.. ఫీచర్లు ఇవే
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

