Realme GT 2 Pro | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్మీ నుంచి జీటీ 2 ప్రో మోడల్ ఫోన్ త్వరలో రానుంది. భారత్‌లో ఏప్రిల్ 7న ఈ ఫోన్ లాంచ్ కానుంది. గత జనవరిలోనే ఈ ఫోన్‌ను చైనాలో లాంచ్ చేశారు. రియల్మీ జీటీ 2 తో పాటు.. రియల్మీ జీటీ 2 ప్రో ఫోన్‌ను చైనాలో రిలీజ్ చేశారు. ఆక్టా కోర్ స్నాప్‌డ్రాగన్ 8 జనరల్ 1 ఎస్వోసీ, 120 హెచ్‌జెడ్ 2కే ఏఎంవోఎల్ఈడీ డిస్ప్లేతో ఈ ఫోన్ లాంచ్ కానుంది. ట్రిపుల్ రేర్ కెమెరా, 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, పేపర్ టెక్ మాస్టర్ డిజైన్ ఆధారిత బయో పాలిమార్ మెటీరియల్, 65 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో రానున్న ఈ ఫోన్ 8 జీబీ ప్లస్ 128 జీబీ మోడల్ ధర సుమారుగా రూ.46,700గా ఉండనుంది.
12 జీబీ ప్లస్ 256 జీబీ వేరియంట్ ధర రూ.51,500 కాగా టాప్ వేరియంట్ 12 జీబీ ర్యామ్ ప్లస్ 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.57,500 గా ఉంది. గత నెలలో రియల్మీ జీటీ 2 ప్రో ఫోన్‌ను యూరప్‌లో లాంచ్ చేశారు. అక్కడ ఈ ఫోన్ ధర రూ.63,100గా ఉంది.
ఆండ్రాయిడ్ 12 ఆధారిత రియల్మీ యూఐ 3.0, 6.7 ఇంచ్ 2కే ఏఎంవోఎల్ఈడీ సూపర్ రియాలిటీ డిస్ప్లే, 120 హెచ్‌జెడ్ అడాప్టివ్ రీఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ స్క్రీన్ ప్రొటెక్షన్, స్నాప్‌డ్రాగన్ 8 జనరల్ 1 ఎస్వోసీ, ట్రిపుల్ రేర్ కెమెరా, 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్766 ప్రైమరీ సెన్సార్, 50 ఎంపీ అల్ట్రా వైట్ షూటర్, 2 ఎంపీ మాక్రో షూటర్, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000 ఎంఏహెచ్, 65 వాట్స్ సూపర్‌డార్ట్ చార్జ్ ఫీచర్లు రియల్మీ జీటీ 2 ప్రో ఫోన్లో ఉన్నాయి.
Get ready to welcome the #realmeGT2Pro!
The World’s First Sustainably Designed Smartphone is aesthetically pleasing, environmentally friendly, and durable.#GreaterThanYouSee.
Launching at 12:30 PM, 7th April on our official channels.
Know more: https://t.co/pgZ3465uDC pic.twitter.com/IqY4pm6tsm
— realme (@realmeIndia) March 24, 2022