REALME 8 5G: ఇటీవల ఒప్పో 20వేల లోపు 5జీ ఫోన్‌ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ రియల్మీ తక్కువ ధరలో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. గత నెలలో రియల్మీ 8, రియల్మీ 8 ప్రొలను భారత్‌లో లాంచ్ చేసిన కంపెనీ ఇప్పుడు రియల్మీ 8 సిరీస్‌లో 5జీ వేరియంట్‌ను విడుదల చేసింది.
8 5జీ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 5G చిప్సెట్తో పనిచేస్తుంది. 8జీ ర్యామ్, 48 ఎంపీ క్వాడ్ కెమెరా సెటప్, సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌తో వస్తుంది. సూపర్సోనిక్ బ్లాక్, సూపర్సోనిక్ బ్లూ కలర్ఆప్షన్లలో లభించనుంది. ఫస్ట్‌సేల్ ఏప్రిల్ 28 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్మీ డాట్‌కామ్ ద్వారా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటాయి.
4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్: రూ .14,999
8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్: రూ .16,999
Introducing the #realme8 5G that features:
— realme (@realmeIndia) April 22, 2021
👉 India’s 1st MediaTek Dimensity 700 5G Processor
👉 8.5mm Super Slim
👉 90Hz Ultra Smooth Display
👉 5000mAh Battery with Smart 5G Power Saving
Starting from ₹14,999.
Sale at 12 PM, 28th Apr.#5GSpeedToInfinityhttps://t.co/XbCTDeuC1Y pic.twitter.com/8GWoayDkrU