న్యూఢిల్లీ : ఆకట్టుకునే ఫీచర్లతో మెరుగైన కెమెరాలతో రియల్మీ 11 ప్రొ సిరీస్ గురువారం భారత్‌లో లాంఛ్ అయింది. ఈ సిరీస్‌లో భాగంగా రియల్మీ 11 ప్రొ, రియల్మీ 11 ప్రొ+ (Realme 11 Pro+) కస్టమర్ల ముందుకొచ్చాయి. రియల్మీ 11 ప్రొ+ 200 ఎంపీ ప్రైమరీ కెమెరా ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ హై-రిజల్యూషన్ కెమెరాతో యూజర్లు అద్భుతమైన ఫొటోలను క్యాప్చర్ చేసుకునే వెసులుబాటుతో డెడికేటెడ్ మూన్ మోడ్‌తో అద్భుతమైన మూన్ షాట్స్‌ను క్యాప్చర్ చేయవచ్చు.
ఫ్లాగ్షిప్ సిరీస్‌ను మినహాయించి ఇతర సెగ్మెంట్ల స్మార్ట్ఫోన్లలో మూన్ మోడ్‌ను కలిగిన తొలి స్మార్ట్‌ఫోన్ రియల్మీ 11 ప్రొ+ కావడం మిడ్ రేంజ్ క్యాటగిరీ కస్టమర్లను ఆకట్టుకుంటుంది. మూన్ మోడ్ శాంసంగ్ గెలాక్సీ ఎస్23 అల్ట్రా, వివో ఎక్స్90 ప్రొ వంటి ప్రీమియం ఫోన్లలోనే అందుబాటులో ఉంది. ఇక మెరుగైన కెమెరాలతో పాటు రియల్మీ 11 ప్రొ సిరీస్ ఆకట్టుకునే డిజైన్‌తో కస్టమర్ల ముందుకొచ్చింది.
రియల్మీ 11 ప్రొ స్టాండర్డ్ మోడల్ రూ. 23,999 కాగా, 8జీబీ + 256జీబీ వేరియంట్ రూ. 24,999కు అందుబాటులో ఉంది. ఇక ప్రొ+ వేరియంట్ బేస్ మోడల్ రూ. 27,999 నుంచి ప్రారంభమవుతుంది. రియల్మీ 11 ప్రొ+ ఫుల్ హెచ్డీ+ రిజల్యూషన్‌తో 6.70 ఇంచ్ టచ్‌స్క్రీన్ డిస్ప్లేతో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ పవర్ఫుల్ ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌ను కలిగిఉంటుంది. ఆండ్రాయిడ్ 13పై రన్ అయ్యే ఈ స్మార్ట్‌ఫోన్ ఫాస్ట్‌చార్జింగ్ సపోర్ట్‌తో 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో కస్టమర్ల ముందుకొచ్చింది.
Read More
Samsung Galaxy F54 5G |మార్కెట్లోకి శాంసంగ్ గెలాక్సీ ఎఫ్54 5జీ.. ధరెంతంటే..?!