Whatsapp | కాలిఫోర్నియా, ఆగస్టు 17: వాట్సాప్‌లో సరికొత్త ఆప్షన్ యూజర్లకు అందుబాటులోకి రాబోతున్నది. ఫొటోల్ని ‘హెచ్డీ’ క్వాలిటీ ఫార్మాట్లోకి మార్చి పంపే సౌలభ్యాన్ని తీసుకువస్తున్నట్టు కంపెనీ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ గురువారం ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్ యూజర్లకు ఈ సరికొత్త ఆప్షన్ మరికొద్ది రోజుల్లో అందుబాటులో రానున్నట్టు చెప్పారు.
అంతేగాక హెచ్డీ క్వాలిటీ వీడియోలను సపోర్ట్ చేసే విధంగా వాట్సాప్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నామని జుకర్‌బర్గ్ తెలిపారు. ఆండ్రాయిడ్, ఐవోఎస్ స్మార్ట్‌ఫో న్, వెబ్లలోనూ కొత్త ఆప్షన్లు అందుబాటులో కి వస్తాయని ‘మెటా’ ఓ ప్రకటనలో పేర్కొన్న ది. హెచ్డీ ఐకాన్‌పై క్లిక్ చేయటం ద్వారా సరికొత్త ఆప్షన్లను ఎంచుకోవచ్చని వివరించింది.