iPhone 13 | ఐఫోన్ 13 కెమెరాతో ట్రీట్మెంట్.. ఈ డాక్టర్ షేర్ చేసిన ఫొటో వైరల్
ఈ మధ్యే ఐఫోన్ 13( iPhone 13 )ను కూడా ఆపిల్ సంస్థ లాంచ్ చేసిన విషయం తెలుసు కదా. ఈ సిరీస్‌లో మొత్తం నాలుగు మోడల్స్‌ను రిలీజ్ చేశారు. అయితే వీటిలోఐఫోన్ 13 ప్రొ, ఐఫోన్ 13 ప్రొ మ్యాక్స్‌లలో మ్యాక్రో ఫొటోగ్రఫీ అనే ఓ కొత్త ఆప్షన్‌ను ఆపిల్ తీసుకొచ్చింది.

న్యూయార్క్: ఆపిల్ సంస్థ తీసుకొచ్చిన ఐఫోన్ గత దశాబ్ద కాలానికిపైగా ఎన్ని సంచలనాలు సృష్టించిందో మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి ఏటా ఓ కొత్త మోడల్‌ను సరికొత్త ఫీచర్లతో లాంచ్ చేస్తూ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకుంది. ఈ మధ్యే ఐఫోన్ 13( iPhone 13 )ను కూడా ఆపిల్ సంస్థ లాంచ్ చేసిన విషయం తెలుసు కదా. ఈ సిరీస్‌లో మొత్తం నాలుగు మోడల్స్‌ను రిలీజ్ చేశారు. అయితే వీటిలోఐఫోన్ 13 ప్రొ, ఐఫోన్ 13 ప్రొ మ్యాక్స్‌లలో మ్యాక్రో ఫొటోగ్రఫీ అనే ఓ కొత్త ఆప్షన్‌ను ఆపిల్ తీసుకొచ్చింది.
ఏంటీ మ్యాక్రో ఫొటోగ్రఫీ?
ఇప్పుడీ ఫీచర్‌ను డాక్టర్లు ఉపయోగిస్తుండటం విశేషం. కంటి డాక్టర్లు తమ పేషెంట్ల కళ్లను పరిశీలించడానికి ఈ మ్యాక్రో ఫొటోగ్రఫీని ఉపయోగిస్తున్నారు. తాజాగా ఆప్తమాలజిస్ట్ డాక్టర్ టామీ కార్న్ షేర్ చేసిన ఓ ఫొటో ఇప్పుడు వైరల్‌గా మారింది. లింక్డిన్లో ఆయన ఈ స్పెషల్ ఫీచర్ వివరాలను పంచుకున్నారు. ఐఫోన్ 13 ప్రొ మ్యాక్స్లోని ఈ మ్యాక్రో మోడ్ సాయంతో ఆయన పేషెంట్ల కళ్ల ఫొటోలను తీస్తున్నారు. దీనిని పరిశీలించిన తర్వాత ఆయన పేషెంట్ కంటి గురించి ఓ అంచనాకు వస్తున్నారు.
దీని గురించి ఆ డాక్టరే వివరించారు. ఈ మ్యాక్రో ఫొటోగ్రఫీ కోసం ఆపిల్ కొత్త లెన్స్‌లను ఉపయోగించలేదు. అల్ట్రావైడ్ కెమెరాలోనే ఈ మ్యాక్రో ఫొటోగ్రఫీ ఆప్షన్‌ను ఇచ్చింది. 2 సెంటీమీటర్ల దూరంలో ఉన్న వాటి ఫొటోలను దీని ద్వారా తీయవచ్చు. షార్ప్ రీస్-స్టీలీ మెడికల్ గ్రూప్‌తో పని చేస్తున్న డాక్టర్ టామీ కార్న్.. కార్నియా పేషెంట్ల చికిత్సలో ఈ ఐఫోన్ 13 స్పెషల్ ఫీచర్‌ను ఉపయోగించారు. ఈ ఫొటోను పోస్ట్ చేయడానికి కూడా తాను ప్రత్యేకంగా అనుమతి తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ ఫీచర్ ఉపయోగించి తాను ఎలా ట్రీట్ చేస్తానన్న విషయం కూడా ఫొటోలను షేర్ చేయడం ద్వారా సదరు డాక్టర్ వివరించడం విశేషం.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Saudi Arabia | సౌదీలో బంగ్లాదేశీ జంట మరణశిక్ష వీడియో వైరల్.. అసలు నిజమిదే!
Mars moon | మార్స్ మూన్ దిశగా జపాన్ స్పేస్ క్రాఫ్ట్.. అర్ధరాత్రి మొదలైన మిషన్..!
Dussehra Celebrations | దేశవ్యాప్తంగా విజయదశమి సందడి చూశారా..?
Influencer Veeramani | డెలివరీ ప్రాంక్‌తో వైరల్ అయిన వీరమణికి ‘ఇన్‌స్టామార్ట్’ సర్ప్రైజ్.. ఉచితంగా అరిసెలు, గిఫ్ట్‌లు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
ట్రెండింగ్ వార్తలు
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి

