Oppo Reno 7 5G | ఒప్పో నుంచి త్వరలో రెనో సిరీస్‌లో భాగంగా 7, 7 ప్రో 5జీ ఫోన్లు విడుదల కానున్నాయి. ఇప్పటికే ఈ ఫోన్లు చైనాలో విడుదలయ్యాయి. కానీ.. భారత్‌లో మాత్రం పూర్తిగా డిఫరెంట్ ఫీచర్లతో ఒప్పో రెనో 7 ఫోన్ విడుదల కానుంది. చైనాలో రెనో 7, రెనో 7ఎస్ఈ పేర్లతో ఫోన్ విడుదల అయ్యాయి. ఇక.. ఒప్పో రెనో 7 5జీ ఫోన్ ధర ఇండియాలో రూ.29,990 నుంచి ప్రారంభం కానుంది. 8జీబీ ప్లస్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర అది. రెనో 7 ప్రో 5జీ ఫోన్ ధర మాత్రం రూ.39,990గా ఉండనుంది. అది 12 జీబీ ప్లస్ 256 జీబీ వేరియంట్.
ఒప్పో రెనో 7 5జీ స్మార్ట్‌ఫోన్.. మీడియాటెక్ డైమెన్సిటీ 900 ఎస్వోసీ ప్రాసెసర్, 8జీబీ ర్యామ్, 5జీబీ వర్చువల్ ర్యామ్ ఎక్స్పాన్షన్, ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 64 జీబీ ఎంపీ ప్రైమరీ సెన్సార్, 8 ఎంపీ అల్ట్రా వైడ్ షూటర్, 2 ఎంపీ మాక్రో షూటర్, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, యూఎస్బీ టైప్ సీ, 3.5 ఎంఎం హెడ్‌ఫోన్ జాక్, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ లాంటి ఫీచర్లతో రానుంది.
ఇక.. రెనో 7 5జీ ఫోన్.. మీడియాటెక్ డైమెన్సిటీ 1200 మ్యాక్స్ ఎస్వోసీ, కలర్ఓస్ 12, సూపర్‌వూక్ ఫాస్ట్ చార్జింగ్ లాంటి ఫీచర్లతో రిలీజ్ కానుంది.