Oppo Reno 7 5G | ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఒప్పో నుంచి త్వరలో రెనో 7 సిరీస్ లాంచ్ కానుంది. ఇప్పటికే ఒప్పో రెనో 7 సిరీస్ చైనాలో గత సంవత్సరం రిలీజ్ అయింది. తాజాగా ఇండియాలో ఈ సిరీస్ను లాంచ్ చేసేందుకు ఒప్పో సన్నాహాలు చేస్తోంది.
చైనాలో లాంచ్ అయిన ఒప్పో రెనో 7 సిరీస్ ఫీచర్లతోనే ఇండియాలోనూ లాంచ్ కానున్నట్టు తెలుస్తోంది. ఒప్పో రెనో 7 కజీ ఫోన్లో క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 778జీ ఎస్వోసీ ప్రాసెసర్, ప్రో మోడల్ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 1200 మ్యాక్స్ ఎస్వోసీ ప్రాసెసర్ ఉండనుంది.
ఈ ఫోన్ ముందుగా ఫ్లిప్కార్ట్లో రిలీజ్ కానుంది. ఈ ఫోన్ ప్రపంచంలో ఫస్ట్ సోనీ ఐఎంఎక్స్709 అల్ట్రా సెన్సింగ్ సెన్సార్ను కలిగి ఉంటుంది. అది 32 ఎంపీ సెన్సార్. ఒప్పో రెనో 7 5జీ ఫోన్ ధర రూ.28,000 నుంచి రూ.31,000 వరకు ఉండనుంది. అలాగే ఒప్పో రెనో 7 ప్రో 5జీ ఫోన్ ధర రూ.41 వేల నుంచి రూ.43 వేల వరకు ఉండనుంది. చైనాలో ఒప్పో రెనో 7 5జీ న్యూ ఇయర్ ఎడిషన్ ఫోన్ను కూడా ఒప్పో లాంచ్ చేసింది. అలాగే ఒప్పో రెనో 7 ప్రో లీగ్ లెజెండ్స్ ఎడిషన్ కూడా లాంచ్ అయింది.