Oppo F31 Phones | ఒప్పో కంపెనీ ఎఫ్31 సిరీస్‌లో మూడు కొత్త స్మార్ట్ ఫోన్లను భారత మార్కెట్లో లాంచ్ చేసింది. ఎఫ్31, ఎఫ్31 ప్రొ, ఎఫ్31 ప్రొ ప్లస్ పేరిట మూడు కొత్త ఫోన్లను విడుదల చేశారు. ఈ ఫోన్లలో ప్రత్యేకంగా వేపర్ చాంబర్స్‌ను ఏర్పాటు చేశారు. దీని వల్ల ఫోన్లను ఎంత తీవ్రంగా ఉపయోగించినప్పటికీ అంత త్వరగా హీట్‌కు గురి కావు. ఈ ఫోన్లలో 7000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 80 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. అందువల్ల ఫోన్లను వేగంగా చార్జింగ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్లకు ప్రత్యేకమైన ఆర్మర్ బాడీ ప్రొటెక్షన్‌ను అందిస్తున్నారు. అలాగే ఐపీ66, 68, 69 డస్ట్, వాటర్ ప్రొటెక్షన్ ఫీచర్ సైతం లభిస్తుంది. ప్రత్యేకమైన ఏఐ ఫీచర్లను సైతం అందిస్తున్నారు.
ఒప్పో ఎఫ్31 స్మార్ట్‌ఫోన్‌లో 6.57 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ ఓలెడ్ డిస్ప్లే ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను ఇచ్చారు. 8జీబీ, 12 జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లభిస్తుంది. ఆండ్రాయిడ్ 15 ఓఎస్‌ను ఇచ్చారు. వెనుక వైపు 50, 2 మెగాపిక్సల్ కెమెరాలు ఉండగా, ముందు వైపు 16 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ ఫీచర్ లభిస్తుంది. బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్ సి సదుపాయాలు ఉన్నాయి.
ఒప్పో ఎఫ్31 ప్రొ 5జి స్మార్ట్ ఫోన్లో 6.57 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ ఓలెడ్ డిస్ప్లేను ఇచ్చారు. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 8జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఆండ్రాయిడ్ 15 ఓఎస్ లభిస్తుంది. వెనుక వైపు 50, 2 మెగాపిక్సల్ కెమెరాలు ఉండగా, ముందు వైపు 32 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఇచ్చారు. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ ఫీచర్ కూడా ఉంది. వైఫై 6, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్ సి వంటి సదుపాయాలు కూడా ఉన్నాయి.
ఒప్పో ఎఫ్31 ప్రొ ప్లస్ 5జి స్మార్ట్ ఫోన్లో 6.8 ఇంచుల ఫుల్ హెచ్డీ ప్లస్ ఓలెడ్ డిస్ప్లేను ఇచ్చారు. మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంది. 8జీబీ, 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది. వెనుక వైపు 50, 2 మెగాపిక్సల్ కెమెరాలు ఉండగా, ముందు వైపు 32 మెగాపిక్సల్ కెమెరాను ఇచ్చారు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ ఫీచర్ కూడా ఉంది. వైఫై 6, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్ సి వంటి సదుపాయాలను కూడా ఇందులో అందిస్తున్నారు.
ఈ ఫోన్లకు చెందిన అన్ని వేరియెంట్ల ధరల వివరాలు ఇలా ఉన్నాయి. ఒప్పో ఎఫ్31కు చెందిన 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.22,999గా ఉంది. 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్‌ను రూ.24,999కు అందిస్తున్నారు. ఒప్పో ఎఫ్31ప్రొ కు చెందిన 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.26,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.28,999గా ఉంది. 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.30,999గా నిర్ణయించారు. ఒప్పో ఎఫ్31 ప్రొ ప్లస్ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.32,999 ఉండగా, 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.34,999గా నిర్ణయించారు. ఈ ఫోన్లను ఒప్పో ఇండియా ఆన్లైన్ స్టోర్‌తోపాటు, అమెజాన్, ఫ్లిప్ కార్ట్ సైట్లలో, అన్ని ఆఫ్ లైన్ స్టోర్స్‌లో సెప్టెంబర్ 27 నుంచి విక్రయించనున్నారు. లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్లపై 10 శాతం ఇన్ స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. రూ.3500 వరకు అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ లభిస్తుంది. 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.