Oppo A96, Oppo A76 | ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం ఒప్పో నుంచి ఏ96, ఏ76 ఫోన్లు భారత్‌లో లాంచ్ అయ్యాయి. ఈ రెండు ఫోన్లు హోల్ పంచ్ డిస్ప్లే డిజైన్‌ను కలిగి ఉన్నాయి. ఆక్టా కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 680 ఎస్వోసీ ప్రాసెసర్, 33 వాట్స్ చార్జింగ్ సపోర్ట్, డుయర్ రేర్ కెమెరాస్ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ తాజాగా భారత్‌లో లాంచ్ అయింది.
ఒప్పో ఏ96.. లార్జ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేను కలిగి ఉండగా.. ఏ76 మాత్రం చిన్న హెచ్డీ ప్లస్ స్క్రీన్‌ను కలిగి ఉంది. ఒప్పో ఏ96.. 8 జీబీ ర్యామ్‌తో రాగా.. ఏ76.. 6 జీబీ ర్యామ్‌తో లాంచ్ అయింది. ఇటీవల లాంచ్ అయిన రెడ్మీ నోట్ 11, మోటరోలా మోటో జీ71 ఫోన్లకు ఇవి పోటీగా వచ్చాయి.
ఒప్పో ఏ96.. 8 జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999 కాగా.. ఒప్పో ఏ76 6 జీబీ ప్లస్ 128 జీబీ మోడల్ ధర రూ.17499గా ఉంది. ఈ ఫోన్లను ఒప్పో ఆన్లైన్ స్టోర్‌లో, ఆఫ్‌లైన్ రిటైలర్స్‌లో కొనుగోలు చేయొచ్చు.
డ్యుయల్ సిమ్(నానో), ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్ఓఎస్ 11.1, 6.59 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 401 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 600 నిట్స్ పీక్ బ్రైట్నెస్, ఆక్టాకోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 680 ఎస్వోసీ, డ్యుయల్ రేర్ కెమెరా సెటప్, 50 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 16 ఎంపీ సెల్ఫీ కెమెరా సెన్సార్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్స్ సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి.
ఆండ్రాయిడ్ 11 ఆధారిత కలర్ఓఎస్ 11.1, 6.56 ఇంచ్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 90 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్, 269 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, స్నాప్‌డ్రాగన్ 680 ఎస్వోసీ, డ్యుయల్ కెమెరా సెటప్, 12 ఎంపీ ప్రైమరీ సెన్సార్, 8 ఎంపీ సెన్సార్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 33 వాట్స్ సూపర్ వూక్ ఫాస్ట్ చార్జింగ్ లాంటి పీచర్లు ఏ76 ఫోన్లో ఉన్నాయి.