న్యూఢిల్లీ : శిక్షణ కోసం చాట్‌జీపీటీ (ChatGPT) డేటాను బార్డ్ కోసం గూగుల్ ఉపయోగించుకోవడం పట్ల తనకు అభ్యంతరం లేదని ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్ స్పష్టం చేశారు. చాట్‌జీపీటీ డేటాను బార్డ్ శిక్షణ కోసం గూగుల్ వాడిందని వార్తలొచ్చాయి. అయితే ఇవన్నీ వదంతులేనని గూగుల్ తోసిపుచ్చింది.
చాట్‌జీపీటీకి పోటీగా గూగుల్ లాంఛ్ చేసిన ఏఐ చాట్‌బాట్ బార్డ్ ఆరంభంలో ఒడిదుడుకులు ఎదుర్కొంది. దాని పరిచయ ప్రకటనలోనే తప్పులు దొర్లాయి. ఇక చాట్‌జీపీటీ డేటాను వాడుతూ గూగుల్ బార్డ్ ట్రైనింగ్ చేపట్టిందనే వార్తలపై ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట్‌మన్ స్పందించారు. చాట్‌జీపీటీ డేటాను గూగుల్ వాడుకోవడం పట్ల తనకేమీ పట్టింపులు లేవని ఆల్ట్‌మన్ ట్వీట్ చేశారు.
అయితే గూగుల్ చాట్‌జీపీటీ లేదా షేర్జీపీటీ నుంచి ఎలాంటి డేటాపై బార్డ్‌కు శిక్షణ ఇవ్వలేదని సెర్చింజన్ దిగ్గజం గూగుల్ పేర్కొంది. మరోవైపు గూగుల్‌లో పనిచేసి ఓపెన్ఏఐలో చేరిన ఏఐ ఇంజనీర్ జాకబ్ డెవ్లిన్ ఓపెన్ఏఐ సర్వీస్ నిబంధనలను ఉల్లంఘిస్తూ చాట్‌జీపీటీ డేటాను వాడరాదని జాకబ్ గూగుల్‌ను హెచ్చరించినట్టు సమాచారం. జాకబ్ వార్నింగ్‌తో చాట్‌జీపీటీ డేటా వాడకాన్ని గూగుల్ నిలిపివేసిందని ఓ వార్తాసంస్ధ వెల్లడించింది.
Read More