OnePlus Buds Pro : వన్‌ప్లస్ బడ్స్ ప్రో ఇయర్‌ఫోన్స్ ధర, ఫస్ట్ సేల్ డిటెయిల్స్ వచ్చేశాయి
ఎన్నో వేలు పెట్టి మంచి స్మార్ట్‌ఫోన్ తీసుకుంటాం. కానీ.. దానికి తగ్గట్టుగా మంచి ఇయర్‌ఫోన్స్ కూడా ఉండాలి. లేదంటే.. చేతుల్లేని మనిషిలా ఉంటుంది ఫోన్. స్మార్ట్‌ఫోన్‌కు తగ్గట్టు ఇయర్‌ఫోన్స్ కూడా ఉండాలి. ఈ మధ్య ఎక్కువగా వైర్లెస్ ఇయర్‌బడ్స్‌నే స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఉపయోగిస్తున్నారు.
సింపుల్‌గా చెవుల్లో పెట్టేసుకుంటే చాలు. బ్లూటూత్ డివైజ్ సైజ్‌లో వచ్చే ఇయర్‌బడ్స్ ప్రస్తుతం ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి.

తాజాగా సూపర్ ఫాస్ట్ చార్జింగ్ ఫీచర్‌తో వన్‌ప్లస్ కంపెనీ.. వన్‌ప్లస్ బడ్స్ ప్రో ఇయర్‌ఫోన్స్‌ను రిలీజ్ చేసింది. నిజానికి.. ఈ ఇయర్‌బడ్స్ గత నెలలోనే రిలీజ్ అయినప్పటికీ.. అప్పుడు దాని ధర, ఫస్ట్ సేల్ వివరాలను వెల్లడించలేదు. వన్‌ప్లస్ నోర్డ్ 2 5జీ స్మార్ట్‌ఫోన్‌తో పాటు వన్‌ప్లస్ బడ్స్ ప్రోను కూడా రిలీజ్ చేశారు.
అలాగే.. గత సంవత్సరం వన్‌ప్లస్ బడ్స్ ఇయర్‌బడ్స్‌ను కూడా విడుదల చేశారు. దాంట్లో ఉన్న ప్రీమియం ఫీచర్లు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్, ఫాస్ట్ చార్జింగ్‌తో పాటు.. ఒక్కసారి చార్జింగ్ చేస్తే30 గంటల పాటు.. ఎటువంటి ఆటంకం లేకుండా మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయొచ్చు.

ఇండియాలో వన్‌ప్లస్ బడ్స్ ప్రో ధరను రూ.9,990 గా నిర్ణయించారు. అయితే.. ఈ ఇయర్‌బడ్స్‌ను.. ఒప్పో ఎన్కో ఎక్స్, సామ్సంగ్ గెలాక్సీ బడ్స్ ప్రో, జబ్రా ఎలైట్ 85టీ, గూగుల్ పిక్సెల్ బడ్స్ ఏ సిరీస్ ఇయర్ఫోన్లకు.. పోటీగా వన్‌ప్లస్ లాంచ్ చేసింది.
ఈ ఇయర్‌బడ్స్‌ను అమెజాన్ ఇండియా, వన్‌ప్లస్ వెబ్సైట్, వన్‌ప్లస్ ఆఫ్‌లైన్ స్టోర్లలోనూ కొనుగోలు చేయొచ్చు. ఈ ఇయర్‌బడ్స్ వైట్, బ్లాక్.. రెండు కలర్స్ వేరియంట్లలో అందుబాటులో ఉంటాయి. ఆగస్టు 26న మధ్యాహ్నం 12 గంటలకు సేల్ ప్రారంభం కానుంది. ఈ ఇయర్‌ఫోన్స్‌లో ఇంటిగ్రేట్ అయిన 11 ఎంఎం డైనమిక్ డ్రైవర్స్ డాల్బీ అట్మాస్ సౌండ్‌తో రానున్నాయి. బ్లూటూత్ వీ5.2, ఐపీఎక్స్4 వాటర్ రెసిస్టెన్స్ లాంటి ఫీచర్లు ఇందులో ఉంటాయి.

Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
Dussehra Special | తొమ్మిది రోజులు కూర్చోరు.. నేలపై పడుకోరు! ఈ గ్రామంలో దసరా నవరాత్రుల్లో వింత మొక్కు!
Idupu Kayitham | దసరా శుభాకాంక్షలు తెలిపిన ‘ఇడుపు కాయితం’ టీమ్.. ఆకట్టుకునే కొత్త పోస్టర్ విడుదల!
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

