OnePlus 13s | స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ వన్ ప్లస్ తన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ వన్ ప్లస్ 13ఎస్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. ఇందులో 6.32 ఇంచుల 1.5కె ఎల్టీపీవో అమోలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్ డిస్ప్లే చాలా క్వాలిటీగా ఉంటుంది. ఈ ఫోన్లో స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో ప్రత్యేకమైన క్రయో వెలాసిటీ వేపర్ చాంబర్‌ను అమర్చారు. అందువల్ల ఫోన్ అంత సులభంగా వేడి కాదు. 12 జీబీ వరకు ర్యామ్‌ను, 512 జీబీ వరకు స్టోరేజ్‌ను ఈ ఫోన్లో అందిస్తున్నారు. ఈ ఫోన్లో ప్రత్యేకంగా వైఫై కోసం జి1 వైఫై అనే టెక్నాలజీని ఏర్పాటు చేశారు. అందువల్ల దీంట్లో వైఫైని మరింత సమర్థవంతంగా ఉపయోగించుకోవచ్చు.
వన్‌ప్లస్ 13ఎస్ స్మార్ట్ ఫోన్ 8.15 ఎంఎం మందాన్ని, 185 గ్రాముల బరువును కలిగి ఉంది. సింగిల్ హ్యాండ్‌తో కూడా సులభంగా ఆపరేట్ చేసే విధంగా ఈ ఫోన్‌ను తీర్చిదిద్దారు. ఈ ఫోన్‌కు 2.5డి కర్వ్డ్ గ్లాస్‌ను ముందు, వెనుక ఏర్పాటు చేశారు. కనుక అద్భుతమైన గ్రిప్‌ను కలిగి ఉంటుంది. ప్రత్యేకంగా గ్రీన్ సిల్క్ వేరియెంట్‌ను అందుబాటులోకి తెచ్చారు. ఇది చాలా ప్రీమియం లుక్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌కు గాను ప్రత్యేకంగా ప్లస్ కీని ఏర్పాటు చేశారు. దీని సహాయంతో ఫోన్లోని పలు ఆప్షన్లను కంట్రోల్ చేయవచ్చు. సౌండ్, వైబ్రేషన్, డు నాట్ డిస్టర్బ్తోపాటు ఏఐ టూల్స్, యూజర్‌కు కావల్సిన ఇతర ఆప్షన్లను ఈ కీ సహాయంతో పొందవచ్చు. ఈ కీ ఆప్షన్లను సెట్ చేసి పెట్టుకుంటే వాటిని త్వరగా యాక్సెస్ చేసేందుకు వీలు కలుగుతుంది.
ఈ ఫోన్లో వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా, మరో 50 మెగాపిక్సల్ 2ఎక్స్ ఆప్టికల్ టెలిఫోటో లెన్స్‌ను ఇచ్చారు. ముందు వైపు 32 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఈ ఫోన్‌కు గాను ఐపీ65 డస్ట్, వాటర్ ప్రూఫ్ ప్రొటెక్షన్‌ను ఇచ్చారు. 5850 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఈ ఫోన్లో అమర్చారు. దీనికి 80 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌ను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్ చాలా వేగంగా చార్జింగ్ అవుతుంది. ఈ ఫోన్‌ను కొనుగోలు చేసిన వారికి 3 నెలల వ్యవధి గల గూగుల్ ఏఐ ప్రొను ఉచితంగా అందిస్తున్నారు. ఈ ఫోన్ 12జీబీ ర్యామ్, 256, 512జీబీ వేరియెంట్లలో లాంచ్ అయింది. ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ లభిస్తుంది. దీనికి గాను 4 ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్, 6 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్ డేట్స్‌ను అందిస్తామని కంపెనీ తెలియజేసింది. డ్యుయల్ సిమ్‌లను వేసుకోవచ్చు.
ఇన్ డిస్ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌తోపాటు ఇన్ ఫ్రారెడ్ సెన్సార్‌ను కూడా ఇచ్చారు. 5జి, డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, బ్లూటూత్ 6.0, యూఎస్బీ టైప్ సి, ఎన్ఎఫ్సీ వంటి అదనపు ఫీచర్లను కూడా ఇందులో అందిస్తున్నారు. ఇక వన్ ప్లస్ 13ఎస్ స్మార్ట్ ఫోన్‌కు చెందిన 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.54,999 ఉండగా, 12జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.59,999గా ఉంది. ఈ ఫోన్లను వన్ ప్లస్ ఆన్లైన్ స్టోర్‌తోపాటు అమెజాన్ లోనూ, రిటెయిల్ స్టోర్లలోనూ కొనుగోలు చేయవచ్చు. జూన్ 12 నుంచి ఈ ఫోన్లను విక్రయించనున్నారు. ఇందుకు గాను ప్రీ బుకింగ్స్ ను ఇప్పటికే ప్రారంభించారు. ఇక లాంచింగ్ కింద ఎస్బీఐ క్రెడిట్ కార్డులతో రూ.5వేల ఇన్ స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. మరో రూ.5వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ ను ఇస్తున్నారు. 15 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని అందిస్తున్నారు.