న్యూఢిల్లీ : వచ్చే ఏడాది జనవరి మాసాంతం లేదా ఫిబ్రవరిలో వన్‌ప్లస్ 10 సిరీస్ చైనాలో లాంఛ్ కానుంది. మార్చ్, ఏప్రిల్ నెలల్లో వన్‌ప్లస్ 10 సిరీస్ గ్లోబల్ మార్కెట్లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. వన్‌ప్లస్ 10 ఫోన్లు స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 చిప్సెట్తో ముందుకొ్స్తాయని కంపెనీ సీఈఓ పీట్ లౌ ధ్రువీకరించారు.
తమ రాబోయే స్మార్ట్పోన్లను స్నాప్‌డ్రాగన్ 8 జెన్1 చిప్సెట్తో తీసుకువస్తామని కంపెనీ గతంలో ప్రకటించింది. ఇక 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యంతో 6.7 ఇంచ్ క్యూహెచ్డీ+తో వన్‌ప్లస్ 10 ప్రొ బ్లాక్, వైట్, గ్రే కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. గతం కంటే భారీ బ్యాటరీ, ఎల్ఈడీ ఫ్లాష్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో వన్‌ప్లస్ 10 ప్రొ కస్టమర్లను ఆకట్టుకుంటుంది.