న్యూఢిల్లీ : అందుబాటు ధరలో బడ్జెట్ స్మార్ట్‌వాచ్‌ను నాయిస్ లాంఛ్ చేసింది. నాయిస్ కలర్‌ఫిట్ కాలిబర్ గో పేరుతో ఈ స్మార్ట్‌వాచ్‌ను నాయిస్ కస్టమర్ల ముందుకు తీసుకువచ్చింది. నాయిస్ కలర్‌ఫిట్ కాలిబర్ గో స్మార్ట్‌వాచ్ పది రోజుల బ్యాటరీ లైఫ్‌ను ఆఫర్ చేస్తోంది. బడ్జెట్ ధరల పరంగా ఈ స్మార్ట్‌వాచ్‌తో షియామి, రియల్‌మి, బోట్ వంటి ఇతర బ్రాండ్ల సరసన నాయిస్ నిలిచింది.
పలు ఫీచర్లతో కూడిన ఈ స్మార్ట్‌వాచ్ రూ 1999కే నాయిస్ ఆఫర్ చేస్తోంది. జెట్ బ్లాక్, రోజ్ పింక్, ఆలివ్ గ్రీన్, మిడ్నైట్ బ్లూ, మిస్ట్ గ్రే వంటి ఐదు కలర్స్‌లో ఈ వాచ్ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌వాచ్ 50 స్పోర్ట్స్ మోడ్స్‌లో, 150 ప్లస్ క్లౌడ్ బేస్డ్ వాచ్ ఫేస్‌లను కలిగిఉంది.
ఈ స్మార్ట్‌వాచ్ నాయిస్ అధికారిక వెబ్సైట్ గోనాయిస్.కాం, ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. ఇక నాయిస్ కలర్‌ఫిట్ కాలిబర్ గో స్మార్ట్‌వాచ్ 1.69 టీఎఫ్టీ డిస్ప్లే, నాయిస్ హెల్త్ సైట్ బిల్టిన్తో ముందుకొచ్చింది. హార్ట్ రేట్, యాక్టివిటీ లెవెల్ మానిటర్లతో పాటు, స్లీప్ ప్యాట్రన్స, స్ట్రెస్ లెవెల్స్ ట్రాకర్ వంటి పలు హెల్త్ ఫీచర్లను కలిగిఉంది.