Winter Gadgets | ఈ చలికాలంలో వెచ్చగా.. ఆరోగ్యంగా ఉండాలంటే ఈ గ్యాడ్జెట్స్ మీ దగ్గర ఉండాల్సిందే!
Winter Gadgets | పొయ్యిమీద నీళ్లు మరిగించుకొని తాగే కాలం కాదిది. నీటిని వేడిచేసేందుకూ టెక్నాలజీని వాడుకొనే తరమిది. ఇలాంటి ఆధునికుల కోసం ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ షావోమీ.. సరికొత్త హాట్ వాటర్ బాటిల్‌ను తయారుచేసింది.‘మిజియా స్మార్ట్ ఎలక్ట్రిక్ హాట్ వాటర్ బాటిల్'గా పిలిచే ఈ పరికరం.. ఒకేసారి 20 కప్పుల నీటిని వేడిచేసి ఇస్తుంది.
Winter Gadgets | గరంగరం పానీ!
పొయ్యిమీద నీళ్లు మరిగించుకొని తాగే కాలం కాదిది. నీటిని వేడిచేసేందుకూ టెక్నాలజీని వాడుకొనే తరమిది. ఇలాంటి ఆధునికుల కోసం ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ షావోమీ.. సరికొత్త హాట్ వాటర్ బాటిల్‌ను తయారుచేసింది.‘మిజియా స్మార్ట్ ఎలక్ట్రిక్ హాట్ వాటర్ బాటిల్’గా పిలిచే ఈ పరికరం.. ఒకేసారి 20 కప్పుల నీటిని వేడిచేసి ఇస్తుంది. 1600 వాట్స్ పవర్‌తో కేవలం 18 నిమిషాల్లోనే 5 లీటర్ల నీటిని మరిగిస్తుంది. నీటిలో క్లోరిన్ వంటి మలినాలను తొలగిస్తుంది. ఇందులోని ఇంటిగ్రేటెడ్ టచ్ ప్యానెల్ ద్వారా.. నచ్చిన ఉష్ణోగ్రతలో నీటిని వేడిచేసుకోవచ్చు. షావోమీ యాప్ ద్వారా.. స్మార్ట్‌ఫోన్ నుంచి కూడా ఈ పరికరాన్ని నియంత్రించవచ్చు. ఈ పరికరంలో స్టెయిన్లెస్ స్టీల్ బాటిల్‌ను ఉపయోగించడం వల్ల ఎక్కువకాలం మన్నుతుంది. 5 లీటర్ల కెపాసిటీతో వస్తున్న ఈ హాట్ వాటర్ బాటిల్ ధర.. రూ.3,500. xiaomistoreph.com ద్వారా ఆర్డర్ చేయవచ్చు.
మగువల కోసం మఫ్లర్
చలి తీవ్రత పెరుగుతున్నది. స్వెటర్లు వేసుకున్నా.. గజగజా వణికిస్తున్నది. ముఖ్యంగా ఉదయాన్నే వాకింగ్, ఆఫీస్‌లకు వెళ్లేవాళ్లు, స్కూల్‌కు వెళ్లే పిల్లలనూ ఇబ్బంది పెడుతున్నది. అలాంటి వారికి మంచి ఆప్షన్.. ఇయర్ మఫ్లర్! అయితే, ఇవి అంత సొగసుగా ఉండవనేది మగువల అభిప్రాయం. ఆ లోటును తీర్చేలా.. ప్రఖ్యాత ఫ్యాషన్ ఉత్పత్తుల సంస్థ ‘మ్యాక్స్ మారా’ సరికొత్త ఇయర్ మఫ్లర్‌ను తీసుకొచ్చింది. ఇటు ఫ్యాషన్‌ను, అటు కంఫర్ట్‌ను దృష్టిలో పెట్టుకొని.. డిజైనర్ బియాన్కో దీనికి రూపకల్పన చేశారు. అల్పకా ఉన్నితో తయారు చేయడం వల్ల ఈ మఫ్లర్లు మృదువుగానే కాదు, అందంగానూ కనిపిస్తాయి. యువతుల ఫ్యాషన్‌లోనూ భాగమవుతాయి. ఇటలీ తయారీ ఇయర్ మఫ్లర్ ధర.. రూ.13,261.mytheresa.com ద్వారా కొనుగోలు చేయవచ్చు.
వెచ్చని నేస్తం
చలికాలంలో వెచ్చని నేస్తం.. స్వెటర్! ఆధునికత పెరగడంతో.. ప్రతి ఒక్కరూ ప్రత్యేకంగా ఆలోచిస్తున్నారు. కొత్తకొత్త వెరైటీల్లో లభించే స్వెటర్లకే ఓటేస్తున్నారు. చలి నుంచి ఉపశమనం పొందడమే కాదు.. స్వెటర్లోనూ ఫ్యాషన్‌ను వెతుక్కుంటున్నారు. అలాంటి ట్రెండీ యూత్ కోసం.. దిగ్గజ ఫ్యాషన్ సంస్థ ఫీబీ ఫైలో షావల్ కాలర్ జంపర్‌ను రూపొందించింది. మృదువైన మెరీనో ఉన్ని, జడలబర్రె (యాక్) ఉన్నిని ఉపయోగించి ఈ జంపర్‌ను తయారుచేశారు. పగటిపూట వేసుకున్నా.. ైస్టెలిష్‌గా కనిపించేలా ఫినిషింగ్ ఇచ్చారు. యువతకు ట్రెండీ లుక్ ఇచ్చే ఈ జంపర్ ధర.. రూ. 1,58,768. phoebephilo.comలో లభిస్తుంది.
వింటర్.. హీటర్!
ఒకప్పుడు శీతకాలం వచ్చిందంటే.. చలి మంటలు వేసుకొనేది! ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. ముఖ్యంగా నగరాల్లో ‘చలి మంటలు’ అనే పదమే వినిపించదు. ఇప్పుడంతా.. రూమ్ హీటర్లే! ప్రసిద్ధ గృహోపకరణాల సంస్థ హావెల్స్.. ఆధునిక ఫీచర్లతో ‘ఓఎఫ్ఆర్ 9 ఫిన్’ పేరుతో రూమ్ హీటర్‌ను విడుదల చేసింది. 2400 వాట్స్ పవర్‌తో పనిచేసే ఈ హీటర్.. 250 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న గదులను కూడా వెచ్చగా ఉంచుతుంది. ఇందులో ఓవర్‌హీట్ ప్రొటెక్షన్ ఉంటుంది. గది ఓవర్‌హీట్ అయినప్పుడు.. ఈ పరికరం దానంతట అదే ఆఫ్ అయిపోతుంది. ఇక సేఫ్టీ కవర్.. పిల్లలకు రక్షణగా ఉంటుంది. మామూలు ఎలక్ట్రిక్ హీటర్‌తో పోలిస్తే.. ఈ ఆయిల్ హీటర్ తక్కువ విద్యుత్‌ను వినియోగించుకుంటుంది. పర్యావరణ హితమైన ఈ రూమ్‌హీటర్ ఖరీదు.. రూ. 15,395. havells.comతోపాటు అన్ని ఆన్లైన్ స్టోర్లలోనూ దొరుకుతుంది.
Read More :
Naya Mall | ఫెరారీ నుంచి అదిరిపోయే బ్లూటూత్ స్పీకర్.. దీని ప్రత్యేకతలు ఏంటంటే..
Naya Mall | ఈ గడియారం చాలా వెరైటీ.. చిన్న ముల్లు సగం తిరిగాక రివర్స్ వచ్చేస్తుంది!
Naya Mall | ఈ కెమెరాలతో ఎంతటి వర్షంలోనైనా అందమైన ఫొటోలు తీయొచ్చు
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

