న్యూఢిల్లీ : ఫ్లిప్‌కార్ట్‌లో మొటొరొలా ఎడ్జ్ 30 అల్ట్రా ప్రస్తుతం తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఈకామర్స్ వెబ్సైట్లో ఈ డివైజ్‌పై రూ 5000 డిస్కౌంట్ ఆఫర్ చేస్తున్నారు. మోటో డేస్ పేరిట ఫ్లిప్‌కార్ట్ ఆయా బ్రాండ్‌కు సంబంధించిన సేల్‌ను నిర్వహిస్తోంది. ఇప్పటికే ప్రారంభమైన ఈ సేల్ నవంబర్ 7 వరకూ కొనసాగుతుంది.
ఈ సేల్‌లో భాగంగా పలు మొటొరొలా ఫోన్లు డిస్కౌంట్‌పై అందుబాటులో ఉన్నాయి. మొటొరొలా ఎడ్జ్ 30 అల్ట్రా స్మార్ట్‌ఫోన్ రూ 59,999కు లాంఛ్ కాగా రూ 5000 డిస్కౌంట్‌తో ఫ్లిప్‌కార్ట్‌లో రూ 54,999కి లిస్టయింది. 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్‌పై ఈ డిస్కౌంట్ వర్తిస్తుండగా దాదాపు ఇదే ధరలో రూ 53,000కు శాంసంగ్ గెలాక్సీ ఎస్22 5జీని ఫ్లిప్‌కార్ట్ విక్రయిస్తోంది.
మొటొరొలా ఎడ్జ్ 30 అల్ట్రా డీసెంట్ కెమెరాతో సరైన లైటింగ్ కండిషన్స్‌లో అద్భుత ఫోటోలను తీసుకోవచ్చు. 5జీ స్మార్ట్‌ఫోన్‌గా కస్టమర్ల ముందుకొచ్చిన మొటొరొలా ఎడ్జ్ 30 అల్ట్రా క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్ఓసీ చిప్‌సెట్‌ను కలిగి ఉండి యూజర్లకు వేగవంతమైన పెర్ఫామెన్స్‌ను అందిస్తుంది.