న్యూఢిల్లీ : మొటొరోలా మరో స్మార్ట్‌వాచ్‌ను మార్కెట్లో లాంఛ్ చేయనుంది. సీఈతో కలిసి మొటొరోలా మోటో వాచ్ 100 అనే న్యూ స్మార్ట్‌వాచ్‌ను లాంఛ్ చేస్తోంది. కెనడా కంపెనీ సీఈ బ్రాండ్స్‌తో కలిసి మొటొరోలా మోటో వాచ్ 100ను మార్కెట్లోకి తీసుకురానుంది. మోటో వాచ్ 100ను మార్కెట్లో ఎప్పుడు లాంఛ్ చేస్తారనే వివరాలను సీఈ బ్రాండ్స్, మొటొరోలా నిర్ధిష్టంగా వెల్లడించలేదు.
ఇక ఈ స్మార్ట్‌వాచ్ డిజైన్ గురించి సీఈ బ్రాండ్స్ అప్డేట్ ఇచ్చింది. ఈ డివైజ్ కుడివైపున రెండు క్రౌన్ బటన్స్‌తో సర్క్యులర్ డిస్ప్లే ఫీచర్ ఉంటుందని పేర్కొంది. వాచ్ అల్యూమినియం కేసుతో హార్ట్‌రేట్ సెన్సర్, ఆక్సిజన్ లెవెల్ సెన్సర్ వంటి కీలక సెన్సర్లు కలిగి ఉండే ఈ డివైజ్ ఫాంథమ్ బ్లాక్, స్టీల్ సిల్వర్ కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. వాచ్ 360 తరహాలోనే ఇది వియర్ఓఎస్పై రన్ అవుతుంది.