Meta layoffs | మెటాలో మళ్లీ మాస్ లేఆఫ్స్..వేలాది ఉద్యోగులపై వేటు..!
వచ్చేవారంలోనే వేలాదిమంది ఉద్యోగులను మెటా (Meta layoffs) తొలగించనుందని బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ పేర్కొంది.
న్యూఢిల్లీ : టెక్ కంపెనీల్లో మాస్ లేఆఫ్స్ ట్రెండ్ కొనసాగుతోంది. కొద్దినెలల కిందట మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ 13,000 మంది ఉద్యోగులను తొలగించగా వచ్చేవారం కొన్నివేల మందిపై వేటు వేసేందుకు సిద్ధమయ్యారని లేటెస్ట్ రిపోర్ట్స్ బాంబు పేల్చాయి. వచ్చేవారంలోనే వేలాదిమంది ఉద్యోగులను మెటా (Meta layoffs) తొలగించనుందని బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ పేర్కొంది. రెండో దశ లేఆఫ్స్ వార్తలను మెటా నిర్ధారించకపోయినా తొలి దశ లేఆఫ్స్‌పై బ్లూమ్‌బర్గ్ వార్తలు నిజం కావడంతో మలిదశ లేఆఫ్స్‌పై టెకీల్లో గుబులు రేగుతోంది.
మెటా ఇటీవల నిరాశజనక రాబడులతో పాటు ఆదాయంలో తగ్గుదలను ప్రకటించడంతో ఖర్చులు తగ్గించుకునే క్రమంలో తాజా లేఆఫ్స్‌కు సన్నాహాలు చేపట్టిందని బ్లూమ్‌బర్గ్ రిపోర్ట్ పేర్కొంది. తాజా లేఆఫ్స్‌లో భాగంగా ఫేస్బుక్, ఇన్స్టాగ్రాంలోనూ కొలువుల కోతలు ఉంటాయని చెబుతున్నారు. వచ్చేవారంలోనే లేఆఫ్స్ ఉంటాయని ప్రపంచవ్యాప్తంగా వేలాది ఉద్యోగులపై ప్రభావం చూపుతాయని అంటున్నారు. ఫైనాన్షియల్ టార్గెట్స్‌కు అనుగుణంగానే లేటెస్ట్ లేఆఫ్స్ ఉంటాయని, సంస్ధ పునర్వ్యవస్ధీకరణ దిశగా కాదని భావిస్తున్నారు.
ఉద్యోగులకు ఇటీవల నిర్వహించిన సామర్ధ్య సమీక్షలో మెటా వేలాదిమంది ఉద్యోగులకు పేలవమైన రేటింగ్స్ ఇచ్చిన నేపధ్యంలోనే లేఆఫ్స్ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. మెటావర్స్‌పై ఫోకస్ పెంచిన మెటా వ్యయ నియంత్రణ చర్యలతో డబ్బు ఆదా చేసేందుకు ఎడాపెడా కొలువుల కోతకు దిగుతోంది. మరోవైపు మెటా ఉద్యోగులకు లో రేటింగ్స్ ఇవ్వడంతో రాబోయే వారాల్లో వారందరూ కంపెనీని వీడవచ్చని వాల్‌స్ట్రీట్ జర్నల్ కథనం పేర్కొంది.
Read More :
Layoffs | 30 శాతం ఉద్యోగులపై అప్‌గ్రాడ్ వేటు
Google | టెక్ జాబ్ కొట్టాలంటే ఈ నైపుణ్యం కీలకం : గూగుల్ మాజీ టాప్ ఎగ్జిక్యూటివ్ వెల్లడి
Apple | భారత్ మార్కెట్‌పై యాపిల్ స్పెషల్ ఫోకస్
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

