Gaganyaan | మరో మిషన్‌ను ప్రారంభించిన ఇస్రో.. శ్రీహరికోటలో సిద్ధమవుతున్న రాకెట్
Gaganyaan | భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో మిషన్‌ను ప్రారంభించింది. ఇటీవల చంద్రయాన్-3 విజయవంతంగా నింగిలోకి పంపిన ఇస్రో.. ఈ మిషన్‌ను కొనసాగిస్తూనే మరో ప్రాజెక్టును అదే గగన్‌యాన్ మిషన్. ఈ ప్రాజెక్టు కోసం సన్నాహాలు ముమ్మరంగా చేస్తున్నది.
Gaganyaan | భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో మిషన్‌ను ప్రారంభించింది. ఇటీవల చంద్రయాన్-3 విజయవంతంగా నింగిలోకి పంపింది. ప్రస్తుతం భూమి కక్ష్యలో తిరుగుతున్న చంద్రయాన్-3 త్వరలోనే చంద్రుడి వైపుగా పరుగులు తీయనున్నది. ప్రస్తుతం ఈ మిషన్‌ను కొనసాగిస్తూనే మరో ప్రాజెక్టును చేపట్టింది. అదే గగన్‌యాన్ మిషన్. ఈ ప్రాజెక్టు కోసం సన్నాహాలు ముమ్మరంగా చేస్తున్నది. ఇందులో భాగంగా మహేంద్రగిరిలోని ఇస్రో ప్రొపల్షన్ రీసెర్చ్ కాంప్లెక్స్ (IPRC)లో గగన్‌యాన్ సర్వీస్ మాడ్యూల్ ప్రొపల్షన్ సిస్టమ్ (SMPS)ని విజయవంతంగా పరీక్షించింది.
ఈ విషయాన్ని ఇస్రో ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. గగన్‌యాన్ తొలి మిషన్‌ను ఆగస్టు చివరలో ప్రారంభించనున్నది. అయితే, మానవరహిత మిషన్ వచ్చే ఏడాది ప్రారంభించనున్నది. ఫిజికల్ రీసెర్చ్ లాబొరేటరీ (పిఆర్ఎల్)లో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా ఇస్రో చైర్మన్ సోమ్‌నాథ్ మాట్లాడుతూ.. గగన్‌యాన్ మిషన్ కోసం శ్రీహరికోటలో రాకెట్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. క్రూ మాడ్యూల్, క్రూ ఎస్కేప్ సిస్టమ్ అనుసంధానం ప్రక్రియ ప్రారంభమైందన్నారు. ఈ నెలాఖరులోగా ఈ పనులు పూర్తి చేసి అన్ని పరీక్షలు పూర్తి చేస్తామని చెప్పారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Harish Rao | కరువు మండలాలు ప్రకటించడం తప్ప సహాయంపై చేతులెత్తేసిన రేవంత్ : మాజీ మంత్రి హరీష్‌రావు
PCOS | పీసీఓఎస్ సమస్య మహిళల్లో అసలు ఎందుకు వస్తుంది.. ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి..?
Rising Stars Asia Cup: రైజింగ్ స్టార్స్ ఆసియా కప్‌కు తిలక్ వర్మ కెప్టెన్సీ.. జట్టులో అభిషేక్, వైభవ్
RJD Somireddy | విద్యా ప్రమాణాల పెంపునకు సమష్టి కృషి చేయాలి : ఆర్జేడీ సోమిరెడ్డి
Sharad Pawar | శరద్ పవార్‌కు ఛాతిలో నొప్పి.. పూణె ఆసుపత్రిలో చేరిక, నిలకడగా ఆరోగ్యం
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

