iQOO Z10 | ప్రస్తుతం ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లను అధిక శాతం మంది ఉపయోగిస్తున్నారు. తక్కువ బడ్జెట్లోనే మంచి ఫీచర్లు కలిగిన ఫోన్లు లభిస్తున్నాయి. అయితే స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య.. బ్యాటరీ బ్యాకప్. ఇప్పటి ఫోన్లలో బ్యాటరీ బ్యాకప్ ఎక్కువగానే లభిస్తోంది. కానీ వినియోగం పెరిగింది. దీంతో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉన్న ఫోన్లు కూడా సరిపోవడం లేదు. అందుకనే తయారీ కంపెనీలు ఇంకా భారీ కెపాసిటీ ఉన్న ఫోన్లను తయారు చేసి వినియోగదారులకు అందిస్తున్నాయి. అందులో భాగంగానే ఐక్యూ లేటెస్ట్గా ఓ స్మార్ట్ ఫోన్‌ను భారీ బ్యాటరీ బ్యాకప్‌తో లాంచ్ చేసింది. ఇందులో ఏకంగా 7300 ఎంఏహెచ్ బ్యాటరీ లభిస్తుండడం విశేషం.
ఐక్యూ కంపెనీ లేటెస్ట్గా జడ్10 పేరిట ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. జడ్ సిరీస్‌లో రిలీజ్ అయిన లేటెస్ట్ ఐక్యూ ఫోన్ ఇదే కావడం విశేషం. ఇందులో 6.77 ఇంచుల డిస్ప్లేను ఏర్పాటు చేశారు. దీనికి 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తున్నారు. అమోలెడ్ డిస్ప్లే అయినందువల్ల స్క్రీన్‌పై దృశ్యాలు చాలా స్పష్టంగా, నాణ్యంగా కనిపిస్తాయి. 5000 నిట్స్ వరకు పీక్ బ్రైట్ నెస్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 7ఎస్ జెన్3 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేయగా 12 జీబీ వరకు ర్యామ్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్ వెనుక వైపు 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండగా మరో 2 మెగాపిక్సల్ సెకండరీ కెమెరాను ఏర్పాటు చేశారు. ముందు వైపు 32 మెగాపిక్సల్ కెపాసిటీ ఉన్న కెమెరా ఉంది.
ఐక్యూ జడ్10 స్మార్ట్ ఫోన్లో ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేసే ఫన్ టచ్ ఓఎస్ 15ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌కు 2 ఏళ్ల వరకు ఆండ్రాయిడ్ అప్డేట్స్ను, 3 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ను అందిస్తామని కంపెనీ తెలియజేసింది. ఇక ఈ ఫోన్‌కు ప్రధాన ఆకర్షణ బ్యాటరీ అని చెప్పవచ్చు. ఇందులో ఏకంగా 7300 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 90 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌ను, 7.5 వాట్ల రివర్స్ వైర్డ్ చార్జింగ్‌ను అందిస్తున్నారు. అందువల్ల భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీ ఉండడమే కాదు ఈ ఫోన్ వేగంగా చార్జింగ్ కూడా అవుతుంది. దీంతో చాలా ఎక్కువ సేపు ఈ ఫోన్‌ను వినియోగదారులు ఉపయోగించుకోవచ్చు. ఈ ఫోన్లో రెండు సిమ్‌లను వేసుకోవచ్చు. మైక్రో ఎస్డీ కార్డు వేసుకునే సదుపాయం లేదు. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండగా, ఇన్ఫ్రారెడ్ సెన్సార్‌ను కూడా అందిస్తున్నారు. యూఎస్బీ టైప్ సి ఆడియోకు ఈ ఫోన్ సపోర్ట్ చేస్తుంది.
ఈ ఫోన్‌కు మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీ ఫీచర్ ను ఇచ్చారు. అందువల్ల ఈ ఫోన్ అంత సులభంగా పగలదు. ఈ ఫోన్లో 5జిని ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ, బ్లూటూత్ 5.2, యూఎస్బీ టైప్ సి వంటి ఇతర ఫీచర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. ఐక్యూ జడ్10 స్మార్ట్ ఫోన్ గ్లేసియర్ సిల్వర్, స్టెల్లార్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో విడుదలైంది. ఈ ఫోన్‌కు చెందిన 8జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.21,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.23,999గా ఉంది. అలాగే 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్‌ను రూ.25,999 కు అందిస్తున్నారు. అమెజాన్‌తోపాటు ఐక్యూ ఇ-స్టోర్స్‌లో ఈ ఫోన్‌ను ఏప్రిల్ 16 నుంచి విక్రయిస్తారు. లాంచింగ్ కింద ఈ ఫోన్‌పై రూ.2000 వరకు ఇన్స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్‌తోపాటు రూ.2000 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను పొందవచ్చు. 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా ఉంది.