న్యూయార్క్ : ఐఫోన్ 14 సిరీస్ లాంఛ్‌లో జాప్యం ఉంటుందనే అంచనాల నేపధ్యంలో తాజా లీక్ ప్రకారం లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఎంట్రీలో జాప్యం ఉండదని తెలిసింది. సెప్టెంబర్ 13న ఐఫోన్ 14 సిరీస్‌ను యాపిల్ లాంఛ్ చేస్తుందని ఐడ్రాప్ న్యూస్‌లో లీక్స్యాపిల్ప్రొ వెల్లడించింది. అయితే ఐఫోన్ లాంఛ్ ఈవెంట్‌పై టెక్ దిగ్గజం ఎలాంటి సమాచారం అందించలేదు.
ఈవెంట్‌ను ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తారా అనే వివరాలను కూడా టిప్‌స్టర్ వెల్లడించలేదు. ఇక లేటెస్ట్ ఐఫోన్స్‌తో పాటు ఎయిర్‌పాడ్స్ ప్రొ2, మూడు యాపిల్ వాచ్‌లతో పాటు పలు ఇతర ఉత్పత్తులను కూడా ఈ ఈవెంట్లో యాపిల్ కస్టమర్ల ముందుకు తీసుకువస్తుందని టిప్‌స్టర్ లీక్స్యాపిల్ప్రొ అంచనా వేస్తోంది. యాపిల్ ప్రస్తుతం జూన్ 6న జరిగే తన డెవలపర్ల కాన్ఫరెన్స్ డబ్ల్యూడబ్ల్యూడీసీ 2022 ఏర్పాట్లలో నిమగ్నమైంది.
ఈ సదస్సులో యాపిల్ ఐపాడ్ఓఎస్, మాక్ఓఎస్ కోసం న్యూ వెర్షన్ ఐఓఎస్ 16ను ప్రకటించవచ్చని భావిస్తున్నారు. ఇక యాపిల్ ఐఫోన్ 14 సిరీస్‌లో నాలుగు నూతన ఐఫోన్ మోడల్స్‌ను లాంఛ్ చేయనుంది. ఈ ఏడాది మిని స్ధానంలో మ్యాక్స్ మోడల్‌ను కంపెనీ తీసుకురానుంది. 2022లో యాపిల్ ఐఫోన్ 14, ఐఫోన్ 14 మ్యాక్స్, ఐఫోన్ 14 ప్రొ, ఐఫోన్ 14 ప్రొ మ్యాక్స్ పేరుతో నాలుగు మోడల్స్‌ను లాంఛ్ చేయనుంది.