న్యూఢిల్లీ : లేటెస్ట్ స్మార్ట్ఫోన్లలో ఐఫోన్ 14 హాట్ డివైజ్‌గా ఆకట్టుకుంటోంది. అమెజాన్ ప్రైమ్ డే సేల్ (Amazon Prime Day sale) ఈవెంట్ జరుగుతుండగా ఈ సేల్‌లో యాపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్లు, హాట్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ఈనెల 15, 16న అమెజాన్ ప్రైమ్ డే సేల్ సాగుతుండగా ఈ సేల్‌లో ఐఫోన్ 14 రూ. 67,000లోపు ధరకే లభిస్తోంది. ఈ హాట్ డివైజ్ ధర రూ. 79,900 కాగా అమెజాన్ సేల్‌లో భాగంగా ఈ స్మార్ట్‌ఫోన్ రూ. 66,999కే సొంతమవుతోంది.
128జీబీ వేరియంట్ ఈ ధరలో లభిస్తుండగా ఈ వేరియంట్ మిడ్నైట్, స్టార్‌లైట్, బ్లూ కలర్స్ ఈ ధరలో అందుబాటులో ఉన్నాయి. ఇక ఇదే వేరియంట్ పర్పుల్ కలర్ డివైజ్ ధర కొంచెం అధికంగా రూ. 67,499కి లభిస్తోంది. ఇక 236 జీబీ మోడల్ అన్ని కలర్స్‌లో రూ. 77,999కి లభిస్తుండగా 512జీబీ రూ. 95,999 పలుకుతోంది. ఐఫోన్ 14 ప్రొ కూడా డిస్కౌంట్ ధరతో లభిస్తోంది.
ఈ స్మార్ట్‌ఫోన్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ 9 శాతం డిస్కౌంట్‌పై రూ. 1.17,999కి లభిస్తుండగా, 256జీబీ వేరియంట్ రూ. 1,34,990కి అందుబాటులో ఉంది. ఇక ఈ ఏడాది సెప్టెంబర్‌లో లాంఛ్ అవుతుందని భావిస్తున్న లేటెస్ట్ యాపిల్ ఫోన్ ఐఫోన్ 15పై అంచనాలు మిన్నంటాయి. ఈ సిరీస్‌లో అన్ని ఫోన్లు డైనమిక్ ఐలండ్ నాచ్ ఫీచర్‌తో పాటు టైప్-సీ చార్జింగ్‌ను సపోర్ట్ చేస్తాయని టెక్ నిపుణులు చెబుతున్నారు.
Read More :
Ring AIR | ఈ చిన్న రింగ్ మీ ఫిట్నెస్ ఏ రేంజ్లో ఉందో చెప్పేస్తుంది!