యాపిల్ ఫోన్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆ తరుణం వచ్చేసింది. ఐఫోన్ 13 సిరీస్ లాంచ్ డేట్ ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 17న ఐఫోన్ 13 ఫోన్‌ను లాంచ్ చేసేందుకు యాపిల్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే.. సెప్టెంబర్ 30న థర్డ్ జనరేషన్ ఎయిర్‌పాడ్స్‌ను యాపిల్ రిలీజ్ చేయనుంది.
అయితే.. అఫిషియల్‌గా యాపిల్ కంపెనీ.. ఐఫోన్ 13 రిలీజ్‌కు సంబంధించి ప్రకటన చేయకపోయినా.. ఫోన్ రిలీజ్ వివరాలు ఆన్లైన్లో లీక్ అయ్యాయి. నిజానికి.. సెప్టెంబర్‌లో ఐఫోన్ 13ను తీసుకురానున్నట్టు యాపిల్ ప్రకటించినప్పటికీ.. తేదీని మాత్రం ఇంకా కన్ఫమ్ చేయలేదు.
ఐఫోన్ 13 సిరీస్‌లో భాగంగా.. ఐఫోన్ 13, ఐఫోన్ 13 ప్రో, ఐఫోన్ 13 ప్రో మ్యాక్స్, ఐఫోన్ 13 మినీ స్మార్ట్ఫోన్లను యాపిల్ రిలీజ్ చేయనుంది. అలాగే.. నెక్స్ట్ జనరేషన్ ఎయిర్‌పాడ్స్‌లో ఎయిర్‌పాడ్స్3ని సెప్టెంబర్ 30న యాపిల్ లాంచ్ చేయనుంది.
గత సంవత్సరం కూడా సెప్టెంబర్‌లోనే ఐఫోన్ 12 సిరీస్‌ను విడుదల చేయాల్సి ఉంది. కానీ.. కరోనా మహమ్మారి వల్ల.. ఐఫోన్ 12 సిరీస్‌ను లేట్‌గా రిలీజ్ చేశారు. కానీ.. ఈసంవత్సరం మాత్రం ఖచ్చితంగా సెప్టెంబర్ మూడో వారంలో ఐఫోన్ 13 సిరీస్‌ను రిలీజ్ చేయాలని యాపిల్ సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
కొత్తగా వచ్చే ఐఫోన్ 13 సిరీస్ ఫోన్లలో బ్యాటరీ కెపాసిటీని పెంచడంతో పాటు.. వైడర్ 5జీ సపోర్ట్ ఉండనున్నట్టు తెలుస్తోంది.