ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్స్టాగ్రామ్.. ఓపెన్ అవడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్ యాప్ ఓపెన్ కాకపోవడంతో ఇన్‌స్టా యూజర్లు.. పోస్టులు అప్డేట్ చేయలేకపోతున్నారు. ఇండియాలోనూ ఇన్‌స్టా కొందరు యూజర్లకు ఓపెన్ అవడం లేదు. ఓపెన్ అయినా స్టోరీలు, పోస్టులు రీలోడ్ కావడం లేదు.
దీంతో.. ఇన్‌స్టా యూజర్లు.,. ట్విట్టర్లో ఇన్‌స్టా పనిచేయడం లేదంటూ ట్వీట్లు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఇన్‌స్టా సర్వర్లు డౌన్ కావడం వల్లే ఈ సమస్య తలెత్తినట్టు తెలుస్తోంది. యాప్ ఓపెన్ చేసి.. స్టోరీస్, పోస్టులు చూడటానికి ప్రయత్నిస్తే.. పోస్టులు, స్టోరీస్ రీలోడ్ కాలేవు.. అంటూ కొందరు యూజర్లకు మెసేజ్ కనిపిస్తోంది.
47 శాతం మంది ఇన్‌స్టా యూజర్లకు యాప్ సరిగ్గా ఓపెన్ కావడం లేదని డౌన్‌టైమ్ ట్రాకింగ్ సైట్ డౌన్‌డిటెక్టర్ వెల్లడించింది. 27 శాతం మంది యూజర్లు.. వెబ్ వర్షన్లో సమస్యను ఎదుర్కొంటున్నారు. 26 శాతం మందికి.. సర్వర్ కనెక్షన్ సమస్యలు వస్తున్నట్టు డౌన్‌డిటెక్టర్ వెల్లడించింది. భారత్‌లో ఈ సమస్య.. గురువారం ఉదయం 10.35 నుంచి ప్రారంభం అయినట్టు తెలుస్తోంది.
People rushing to Twitter when their #instagram is down😂😂 pic.twitter.com/CdARvwfISV
— A55ii._ (@A55ii3) September 2, 2021
*INSTAGRAM GOES DOWN*
— ♛ 𝙏𝙃𝙀 𝙁𝙇𝙊𝙋 𝙈𝙀𝙈𝙀𝙍® 🇮🇳 (@SAWAN__DATTA) September 2, 2021
Le everyone:#instagramdown #instagram pic.twitter.com/cYNWWbPF4m
Me after opening #instagram every 5 secs even though Ik that it’s down #instagramdown pic.twitter.com/TJJJq5luJc
— Emaan Jawed (@JawedEmaan) September 2, 2021