Elon Musk on RIPTwitter | ట్విట్టర్ కొత్త బాస్ ఎలన్‌మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలు ఈ సోషల్ మీడియా వేదిక భవితవ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. కష్టపడి పని చేస్తారా.. వైదొలుగుతారా.. తేల్చుకోండంటూ ఆల్టిమేటం జారీ చేయడంతో ట్విట్టర్ ఉద్యోగుల్లో నిరసన వెల్లువెత్తింది. గడువు లోపే 1200 మంది స్వచ్ఛందంగా వైదొలిగారు.. అలా వెళ్లిపోతూ సోషల్ మీడియాలో `రిప్ ట్విట్టర్ RIP Twitter #హ్యాష్ ట్యాగ్ అని పెట్టిన పోస్టులు వైరలయ్యాయి. వీటికి నెటిజన్లు మీమ్స్‌తో రిప్లయ్ ఇచ్చారు. త్వరలో ట్విట్టర్ మూత పడుతుందంటూ కామెంట్స్ చేశారు.
Twitter is ALIVE
— Elon Musk (@elonmusk) November 20, 2022
రిప్ ట్విట్టర్ అన్న పోస్టులపై తాజాగా ఎలన్‌మస్క్ రియాక్టయ్యారు. `ట్విట్టర్ బతికే ఉంది` అంటూ ఆదివారం ట్వీట్ చేశారు. ఎలన్‌మస్క్ ట్వీట్‌పై ఓ యూజర్ ప్రతిస్పందిస్తూ.. మునుపటిలా మరోమారు ఎగురుతుందా? అని ప్రశ్నించారు. మరొక నెటిజన్.. `మీరు ట్విట్టర్‌ను నాశనం చేసేశారు.. మేమంతా వెళ్లిపోతాం` అని రిప్లయ్ ఇచ్చారు.
ట్విట్టర్‌ను హస్తగతం చేసుకోగానే సంస్థ సీఈవోగా ఉన్న పరాగ్ అగర్వాల్‌తోపాటు మరో ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లను ఇండ్లకు సాగనంపారు. ట్విట్టర్‌ను లాభాల బాట పట్టించే పేరిట సగం మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికారు.
సంస్థ రెవెన్యూ కోసం బ్లూ టిక్ వెరిఫికేషన్‌కు 8 డాలర్ల ఫీజు పెట్టి, ఉపసంహరించుకున్నారు.. మళ్లీ ఈ నెలాఖరులో ట్విట్టర్ బ్లూ టిక్ వెరిఫికేషన్ తీసుకొస్తున్నారు. ఇలా ట్విట్టర్ విషయమై ఎలన్‌మస్క్ తీసుకుంటున్న నిర్ణయాలతో ఎప్పుడేం జరుగుతుందోనని ఆ సంస్థ ఉద్యోగులు బిక్కుబిక్కుమంటున్నారు.
బ్లూటిక్ వెరిఫికేషన్ సబ్స్క్రిప్షన్ గురించి మీరు సీరియస్‌గా ఉన్నారా.. తెలియజేయండి అని మరో నెటిజన్ రియాక్టయ్యాడు.అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఖాతా పునరుద్ధరించడాన్ని గుర్తు చేసిన యూజర్.. సస్పెండ్ అయిన ఇతర అకౌంట్లు తెరుస్తారా? అని నిలదీశారు.
The people have spoken.
Trump will be reinstated.
Vox Populi, Vox Dei. https://t.co/jmkhFuyfkv
— Elon Musk (@elonmusk) November 20, 2022