Emails : మీ ఈమెయిల్స్‌ను ఎవరో ట్రాక్ చేస్తున్నట్టు అనిపిస్తోందా? ట్రాక్ ఆప్షన్‌ను ఇలా డిసేబుల్ చేసేయండి
మీ ఈమెయిల్స్‌ను ఎవరో ట్రాక్ చేస్తున్నట్టు అనిపిస్తోందా? | ప్రస్తుతం చాలామంది జీమెయిల్, ఔట్లుక్, యాపిల్ మెయిల్ ఉపయోగిస్తుంటారు. ఇదివరకు యాహూ, రెడిఫ్ ఉపయోగించేవారు
ప్రస్తుతం చాలామంది జీమెయిల్, ఔట్లుక్, యాపిల్ మెయిల్ ఉపయోగిస్తుంటారు. ఇదివరకు యాహూ, రెడిఫ్ ఉపయోగించేవారు కానీ.. ఇప్పుడు ఎక్కువగా జీమెయిల్ వాడుతున్నారు. అయితే.. కొన్నిసార్లు మెయిల్‌కు ప్రమోషనల్ మెయిల్స్ వస్తుంటాయి. వాటిని ఎవరు పంపిస్తారో తెలియదు. ఆ మెయిల్స్ ఓపెన్ చేస్తే అందులో కొన్ని లింక్స్ ఉంటాయి. ఇంకొన్ని అట్రాక్టివ్ ఆఫర్స్ ఉంటాయి.

కొన్ని కంపెనీలు కొందరు కస్టమర్లను టార్గెట్ చేసుకొని.. వాళ్లకు ప్రమోషనల్ మెయిల్స్ పంపిస్తుంటాయి. ఆ మెయిల్స్‌ను కస్టమర్లు ఓపెన్ చేశారా లేదా.. లింక్ క్లిక్ చేశారా.. లేదా.. అనే విషయాలన్నింటినీ కొన్ని కంపెనీలు ట్రాక్ చేస్తుంటాయి. కానీ.. కస్టమర్లకు ఆ విషయం తెలియదు.
ఈమెయిల్ ట్రాకింగ్ సిస్టమ్ ద్వారా అవి మెయిల్స్ ఓపెన్ రేట్‌ను ట్రాక్ చేస్తుంటాయి. దాని కోసం కస్టమర్లకు పంపించే ఈమెయిల్లోనే సింగిల్ ట్రాకింగ్ పిక్సెల్ కోడ్‌ను ఎంబెడ్ చేస్తారు. అదే.. కంపెనీ సర్వర్‌కు.. ఓపెన్ రేట్‌ను పంపిస్తుంటుంది. అయితే.. ఈ ట్రాకింగ్ సిస్టమ్ వల్ల.. కస్టమర్ ఈమెయిల్ పర్సనల్ డిటెయిల్స్, మెయిల్స్ లాంటి వాటిని కంపెనీ ట్రాక్ చేయలేదు కానీ.. కేవలం.. ఆ కంపెనీ పంపించిన మెయిల్ ఓపెన్ రేట్‌ను మాత్రమే ట్రాక్ చేయగలుగుతుంది.
అలాగే.. టార్గెటెడ్ యాడ్స్ కోసం కావాల్సిన కొంత సమాచారాన్ని మాత్రం సేకరించగలుగుతుంది.
అయితే.. ప్రమోషనల్ మెయిల్స్ ఓపెన్ రేట్‌ను కూడా ట్రాక్ చేయకుండా ఉండాలంటే.. సెక్యూరిటీని పెంచుకోవాలంటే ఈ పని చేస్తే చాలు.. ఇక జన్మలో కంపెనీలు.. మెయిల్ ఓపెన్ రేట్‌ను ట్రాక్ చేయలేవు.
జీమెయిల్లో ఎలా సెట్ చేసుకోవాలి?
మీరు జీమెయిల్ యూజర్లు అయితే.. డెస్క్‌టాప్‌లో జీమెయిల్ ఓపెన్ చేసి.. సెట్టింగ్స్‌లోకి వెళ్లి అక్కడ జనరల్ ట్యాబ్‌లోకి వెళ్లండి. అక్కడ ఫైండ్ ఇమేజెస్ అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి. అక్కడ Ask before displaying external images అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేంజెస్ బటన్ మీద క్లిక్ చేయండి. దీని వల్ల.. ప్రమోషనల్ కోసం పంపించే మెయిల్స్‌లో ఉండే ఫోటోలు లోడ్ కావు.. డౌన్లోడ్ కావు. మొబైల్లో కూడా సేమ్ ఇదే ప్రొసీజర్ ఉపయోగించి.. ఇమేజ్‌లు లోడ్ కాకుండా బ్లాక్ చేయొచ్చు.
మైక్రోసాఫ్ట్ ఔట్‌లుక్‌లో ఎలా బ్లాక్ చేయాలి?
ఔట్లుక్ మెయిల్ వాడేవాళ్లు.. సపరేట్ గా సెట్టింగ్స్ చేసుకోవాల్సిన పనిలేదు. ప్రమోషనల్ ఫోటోలను ఔట్లుక్ డీఫాల్ట్‌గా బ్లాక్ చేస్తుంది. అయితే.. ఒక్కోసారి కొన్ని ఫోటోలు లోడ్ అయితే మాత్రం ఫైల్లోకి వెళ్లి ఆప్షన్స్, ట్రస్ట్ సెంటర్, ట్రస్ట్ సెంటర్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అక్కడ ఆటోమెటిక్ డౌన్లోడ్ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకొని Don’t download pictures automatically in RSS items or standard HTML e-mail messages అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇది విండోస్ ఓఎస్ వాళ్లకు. ఒకవేళ మాక్ ఓఎస్ వాడే యూజర్లు అయితే.. ఔట్‌లుక్‌లో ప్రిఫరెన్సెస్, రీడింగ్, సెక్యూరిటీ మీద క్లిక్ చేసి.. ఇమేజెస్ డౌన్లోడ్ కాకుండా ఆఫ్ చేసుకోవచ్చు.
యాపిల్ మెయిల్లో ఎలా బ్లాక్ చేయాలి?
మాక్‌లో యాపిల్ మెయిల్ యాప్ ఓపెన్ చేసి.. ఆటోమెటిక్ ఇమేజ్ లోడింగ్‌ను డిసేబుల్ చేసుకోవాలి. మెయిల్, ప్రిఫరెన్సెస్, వ్యూయింగ్, లోడ్ రిమోట్ కంటెంట్ ఆనే ఆప్షన్‌ను అన్‌చెక్ చేసుకోవాలి. ఐఫోన్ మొబైల్ యాప్‌లో అయితే.. సెట్టింగ్స్, మెయిల్ అండ్ టాగ్లింగ్ ఆఫ్ లోడ్ రిమోట్ ఇమేజెస్ అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి.
ఇవి కూడా చదవండి..
SpaceX | నెక్స్ట్ అంతరిక్ష ప్రయాణంలో ఫ్రీ వైఫై, వేడి వేడి ఆహారం: ఎలోన్ మస్క్
Space X | చరిత్ర సృష్టించిన స్పేస్ ఎక్స్.. 3 రోజులపాటు నలుగురు సాధారణ వ్యక్తులు స్పేస్‌లోకి..
ఇవాళ ఆకాశంలో అద్భుతం.. ఆ మూడు ఖగోళ రాశులూ ఒకేచోట..
ISS | స్పేస్ స్టేషన్‌లోని ఆస్ట్రోనాట్లు రోజుకు ఎన్ని సూర్యోదయాలు చూస్తారో తెలుసా?
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

