గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ
నల్లగొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ అనుబంధంతో TASK–నాంది మహీంద్రా ప్రైడ్ క్లాస్రూమ్ ఆధ్వర్యంలో ఈ నెల 23 నుంచి 28 వరకు ఆరు రోజుల నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
రామగిరి, నవంబర్ 28 : నల్లగొండలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయ అనుబంధంతో TASK–నాంది మహీంద్రా ప్రైడ్ క్లాస్రూమ్ ఆధ్వర్యంలో ఈ నెల 23 నుంచి 28 వరకు ఆరు రోజుల నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా 36 గంటల పాటు 18 అంశాలపై విద్యార్థినులకు కమ్యూనికేషన్ స్కిల్స్, స్పోకెన్ ఇంగ్లీష్, వ్యక్తిత్వ వికాసం, కెరీర్ గైడెన్స్, ఇంటర్వ్యూ సన్నద్ధత, గ్రూప్ డిస్కషన్, డిజిటల్ గుర్తింపు, సమయ నిర్వహణ తదితర అంశాల్లో శిక్షణ అందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ పవిత్ర వాణి కర్ష మాట్లాడుతూ విద్యార్థినుల సమగ్ర అభివృద్ధికి నైపుణ్యాభివృద్ధి ఎంతో అవసరమన్నారు. వైస్ ప్రిన్సిపాల్ ఎ.మానెమ్మ విద్యార్థినులు ఇటువంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమాన్ని TASK కోఆర్డినేటర్ ఎన్. అపర్ణ సమన్వయం చేయగా, శిక్షకుడు రమేష్ బూరుగు శిక్షణ అందించారు. అధ్యాపకులు, విద్యార్థినులు పాల్గొన్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ
KCR Deeksha Divas | ఆస్ట్రేలియాలో ఘనంగా కేసీఆర్-దీక్షా దివస్.. ఉద్యమ స్పూర్తిని చాటిన ప్రవాస తెలంగాణ బిడ్డలు
నల్లగొండను బాల్య వివాహ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి : కలెక్టర్ చంద్రశేఖర్
Deeksha Divas | దీక్షా దివస్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి : మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునిత
Health tips | ఆ ఆరోగ్య సమస్యలకు పుదీనాతో చక్కటి పరిష్కారం.. తెలుసా..?
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

