కరోనా మహమ్మారి వల్ల.. అందరి జీవితాలు తలకిందులు అయ్యాయి. 2020 ముందు ఒక లెక్క. 2020 తర్వాత ఒక లెక్క.. అన్న చందంగా అందరి జీవితాలతో కరోనా ఆడుకుంది. ఇంకా ఆడుకుంటూనే ఉన్నది. కరోనా వల్ల విద్యావవస్థ మొత్తం కుప్పకూలిపోయింది. స్కూళ్లు, కాలేజీలు, అన్ని విద్యా సంస్థలు మూతపడ్డాయి. దీంతో విద్యారంగంలో పని చేసే వాళ్లకు కష్టాలు మొదలయ్యాయి. కరోనా మొదటి వేవ్ సమయం నుంచి ఇప్పటి వరకు విద్యాసంస్థలు మూతపడే ఉన్నాయి. మధ్యలో ఓ నెలా రెండు నెలలు తెరుచుకున్నప్పటికీ.. మళ్లీ మూతపడ్డాయి.
దీంతో విద్యా సంస్థలు విద్యార్థులకు ఆన్లైన్లో క్లాసులు చెప్పడం ప్రారంభించాయి. అప్పుడే లైమ్ లైట్లోకి వచ్చింది జూమ్. అప్పటి వరకు జూమ్‌ను కేవలం ఆఫీసు మీటింగ్‌లకు, ఇతర వీడియో కాన్ఫరెన్స్‌లకు మాత్రమే ఉపయోగించేవారు. ఆన్ లైన్ క్లాసుల కోసం ఉపయోగించింది చాలా తక్కువ. కానీ.. ఇప్పుడు ఏ ఆన్ లైన్ క్లాస్ అయినా సరే.. జూమ్నే ఉపయోగిస్తున్నారు. జూమ్‌తో పాటు.. గూగుల్ మీట్, టీమ్స్ అనే ఇతర యాప్స్ ఉన్నప్పటికీ.. జూమ్ యాప్‌కే ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్నారు క్లాసులు నిర్వహించేవారు.
ఈ యాప్ ద్వారా ఒక హోస్ట్ వీడియోను ప్రారంభించి.. అందులో పార్టిసిపెంట్స్‌ను యాడ్ చేసి అందరికీ స్క్రీన్ షేర్ చేస్తారు. అలా ఆన్ లైన్ క్లాసులు నడుస్తుంటాయి. అయితే.. ఒకవేళ.. ఆ వీడియో కాల్‌ను రికార్డు చేసుకోవాలంటే ఎలా? వీడియో కాల్‌ను రికార్డు చేసి.. దాన్ని ఇతర పార్టిసిపెంట్స్‌కు పంపించాలన్నా.. లేదా.. క్లాస్ అయిపోయాక.. మరోసారి చూసుకోవాలన్నా ఎలా చేయాలి?
ఈ ఫీచర్ ద్వారా వీడియో కాల్‌ను రికార్డు చేసుకోవాలనుకుంటే.. ఫ్రీగా జూమ్‌ను ఉపయోగించే యూజర్లు మాత్రం వీడియోను రికార్డు చేసి.. తమ పీసీలో మాత్రమే డౌన్లోడ్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ ఫీచర్ కేవలం జూమ్ డెస్క్‌టాప్ క్లయింట్ వర్షన్ 2.0 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. విండోస్, మాక్ ఓఎస్, లైనక్స్ ఓఎస్‌లో మాత్రమే ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.
ముందు.. జూమ్ డెస్క్‌టాప్ క్లయింట్ లేటెస్ట్ వర్షన్‌ను కంప్యూటర్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ తర్వాత న్యూ మీటింగ్‌ను హోస్ట్ చేయడం కానీ.. లేదా ఇదివరకే స్టార్ట్ చేసిన మీటింగ్‌లో జాయిన్ అవ్వడం కానీ చేయాలి. జాయిన్ అయిన తర్వాత వీడియో కాల్ స్క్రీన్ మీద టాప్ లెఫ్ట్ కార్నర్లో ఉండే రికార్డు బటన్ మీద క్లిక్ చేసి స్టార్ట్ రికార్డింగ్ అంటే సరిపోతుంది. మీటింగ్ పూర్తయ్యాక.. ఫైల్‌ను ఇచ్చిన పాత్లో జూమ్ ఆటోమెటిక్ గా సేవ్ చేస్తుంది. సేవ్ చేసిన ఫైల్‌ను ఎప్పుడైనా ఓపెన్ చేసి మళ్లీ చూడొచ్చు. లేదా.. ఎవరికైనా పంపించవచ్చు. ఒకవేళ మధ్యలో రికార్డింగ్‌ను ఆపేయాలనుకుంటే.. పాజ్ స్టాప్ బటన్ మీద క్లిక్ చేయాలి.