Wordle | వర్డ్ల్ గేడ్ గురించి విన్నారా ఎప్పుడైనా. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండేవాళ్లకు ఈ గేమ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఈ గేమ్ గురించే చర్చ. అసలు ఏంటి ఈ గేమ్. దీనికి ఎందుకంత క్రేజ్. తెలుసుకుందాం రండి.
ఈ గేమ్ చాలా సింపుల్. ఇంగ్లీష్ వర్డ్‌ను గెస్ చేసే గేమ్. ప్రతి రోజు కొత్త కొత్త వర్డ్ ఉంటుంది. ఐదు లెటర్స్ ఉంటాయి. ఆరు చాన్స్‌లు ఉంటాయి. ఈ గేమ్ కోసం ఒక వెబ్సైట్ ఉంటుంది. దీని కోసం ఇప్పటి వరకు యాప్‌ను రూపొందించలేదు. https://www.powerlanguage.co.uk/wordle/ ఈ వెబ్సైట్లోకి వెళ్లి ఈ గేమ్‌ను ఆడొచ్చు. ఈ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయగానే ఒక గ్రిడ్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ లైన్లో ఐదు లెటర్ల వర్డ్‌ను గెస్ చేయాల్సి ఉంటుంది. ఆ వర్డ్ కోసం ఎటువంటి క్లూస్ ఉండవు. రాండమ్‌గా వర్డ్‌ను గెస్ చేసి.. ఆ గ్రిడ్‌లో టైప్ చేయాలి. ఒకవేళ మీరు గెస్ చేసిన వర్ట్లో ఉన్న లెటర్స్ ఒరిజినల్ వర్డ్‌లో ఉన్న లెటర్స్ మ్యాచ్ అయితే.. సేమ్ పొజిషన్లో ఉంటే ఆ లెటర్స్ గ్రీన్ కలర్లో చూపిస్తారు. ఒకవేళ లెటర్స్ ఒరిజినల్ వర్డ్‌లో ఉండి.. సేమ్ పొజిషన్ కాకపోతే ఎల్లో కలర్లో హైలైట్ అవుతుంది. ఒకవేళ ఆ లెటర్స్ ఆ వర్డ్‌లో లేకపోతే గ్రే కలర్లో హైలైట్ అవుతుంది.
గ్రీన్ కలర్, ఎల్లో కలర్లో హైలైట్ అయ్యే లెటర్సే క్లూ అన్నమాట. వాటి ఆధారంగా అసలైన వర్డ్ ఏదో గెస్ చేయాల్సి ఉంటుంది. ఎక్కువ రిపీటెడ్ లెటర్స్ ఉన్న వర్డ్ కాకుండా.. రిపీట్ కాని లెటర్స్, ఓవెల్స్ ఎక్కువగా ఉన్న వర్డ్‌తో గెస్ చేస్తే.. అసలైన వర్డ్ ఏదో ఈజీగా చెప్పేయొచ్చు.
నిజానికి ఈ గేమ్ లాక్డౌన్ టైమ్‌లో పాపులర్ అయింది. టైమ్ పాస్ కోసం ఈ గేమ్‌ను ఆడటం మొదలు పెట్టారు జనాలు. ఆ తర్వాత సోషల్ మీడియాలో దీని గురించి తెలియడం.. గేమ్ కూడా కాస్త ఫన్నీగా ఉండటంతో దీనికి పిల్లలతో పాటు యూత్ కూడా అడిక్ట్ అయిపోయారు. ఒకసారి ఒరిజినల్ వర్డ్‌ను గెస్ చేశాక… 5 గంటల పాటు వెయిట్ చేస్తే మరో కొత్త వర్డ్‌తో గేమ్ రీస్టార్ట్ అవుతుంది.