ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ తాజాగా సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తమ యూజర్ల సెక్యూరిటీ కోసం ట్విట్టర్ సమయానికి అనుగుణంగా కొత్త అప్డేట్స్ను, కొత్త ఫీచర్లను తీసుకొస్తున్న విషయం తెలిసిందే. తాజాగా.. ట్విట్టర్ ఫాలోవర్స్ నుంచి వస్తున్న ఇబ్బందులను గుర్తించిన ట్విట్టర్.. బెస్ట్ ఫీచర్‌ను తీసుకొచ్చింది.
కొందరు ఫాలోవర్స్ పనికిమాలిన ట్వీట్లను పెడుతుంటారు. మరికొందరు అనవసరమైన కామెంట్లు, లైకులు, రీట్వీట్లు చేస్తుంటారు. వీళ్ల బెడద ఎలా పోవాలి. ఊరికే ట్యాగ్ చేయడం.. ట్వీట్లు చేయడం.. ఇలాంటి ఇబ్బందులు పెట్టేవాళ్ల అకౌంట్లను ఇదివరకు అయితే అన్‌ఫాలో చేయడమో లేక బ్లాక్ చేయడమో చేసేవాళ్లు యూజర్లు. అలా చేస్తే వాళ్లకు తెలిసిపోతుంది కాబట్టి.. సరికొత్తగా మ్యూట్ అనే కొత్త ఫీచర్‌ను ట్విట్టర్ తీసుకొచ్చింది.
ట్విట్టర్లో కొత్తగా వచ్చిన మ్యూట్ ఆనే ఫీచర్ ఏం చేస్తుందంటే.. మీరు ఏ యూజర్ అకౌంట్‌ను అయితే బ్లాక్ చేయాలని అనుకుంటున్నారో.. వాళ్లను మ్యూట్ చేస్తే ఆ అకౌంట్ ట్వీట్లు మీ టైమ్‌లైన్‌లో కనిపించవు. మీరు ఆ అకౌంట్‌ను మ్యూట్ చేసినట్టు కూడా వాళ్లను తెలియదు.
అలాగే కావాలనుకున్నప్పుడు తిరిగి ఆ అకౌంట్లను అన్‌మ్యూట్ కూడా చేసుకోవచ్చు. ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఓఎస్ రెండింట్లో ఈ ఫీచర్‌ను ట్విట్టర్ తీసుకొచ్చింది. అయితే.. ఒకసారి అకౌంట్‌ను మ్యూట్ చేసినా.. వాళ్లను ఫాలో అవొచ్చు.. లేదా అన్‌ఫాలో అవచ్చు. ఆ యూజర్ కూడా మిమ్మల్ని ఫాలో, అన్‌ఫాలో చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే మ్యూట్ అయిన అకౌంట్ నుంచి మాత్రం ట్వీట్స్ రావు, పుష్ లేదా ఎస్ఎంఎస్ నోటిఫికేషన్లు రావు.
ట్విట్టర్ ఓపెన్ చేసి ఏ యూజర్ అకౌంట్ అయితే మ్యూట్ చేయాలనుకుంటారో ఆ యూజర్ అకౌంట్లోకి వెళ్లాలి. ఆ తర్వాత ఏదైనా ఒక ట్వీట్‌ను ఓపెన్ చేసి.. ఆ ట్వీట్ పక్కన ఉన్న మూడు చుక్కల(మోర్) ఐకాన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు కొన్ని ఆప్షన్లను ట్విట్టర్ సూచిస్తుంది. అన్‌ఫాలో, యాడ్ లేదా రిమూవ్ ఫ్రమ్ లిస్ట్, మ్యూట్, బ్లాక్, రిపోర్ట్ ట్వీట్ అనే ఆప్షన్ల నుంచి మ్యూట్ అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. అంతే.. మీరు ఫలానా అకౌంట్‌ను మ్యూట్ చేశారు అని ఒక మెసేజ్ వస్తుంది. అంతే.. ఆ అకౌంట్‌తో ఇక మీకు ఎలాంటి సమస్యలు రావు. ఒకవేళ పొరపాటుగా ఏదైనా అకౌంట్‌ను మ్యూట్ చేస్తే మాత్రం.. దాన్ని అన్‌మ్యూట్ చేసుకోవచ్చు.
దాని కోసం కూడా అదే ప్రొసీజర్. ముందు అన్‌మ్యూట్ చేయాలనుకున్న యూజర్ అకౌంట్లోకి వెళ్లి అన్‌మ్యూట్ చేసుకోవచ్చు. లేదంటే ఆ అకౌంట్ ప్రొఫైల్ మీద అన్‌మ్యూట్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు ఈ అకౌంట్ నుంచి ట్వీట్స్‌ను మ్యూట్ చేశారు.. అనే మెసేజ్ అక్కడ ఉంటుంది. పక్కనే ఉన్న అన్‌మ్యూట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే.. ఒక పాప్ అప్ చూపిస్తుంది. ఒకవేళ మీరు అన్‌మ్యూట్ చేస్తే.. మీ హోమ్ టైమ్‌లైన్‌లో ఈ అకౌంట్ ట్వీట్స్ కనిపిస్తాయని మెసేజ్ చూపిస్తుంది. కింద అన్‌మ్యూట్, క్యాన్సిల్ అనే రెండు ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిలో అన్‌మ్యూట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే.. సదరు అకౌంట్ అన్‌మ్యూట్ అయిపోతుంది.
ఇప్పటి వరకు మ్యూట్ చేసిన అకౌంట్ల గురించి తెలుసుకోవాలంటే.. ట్విట్టర్ యాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అక్కడ సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ మెనులో మ్యూటెడ్ అనే ఆప్షన్లో మ్యూటెడ్ అకౌంట్స్ తెలుసుకోవచ్చు. అక్కడే ఆ అకౌంట్స్‌ను అన్‌మ్యూట్ కూడా చేసుకోవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Motorola : స్మార్ట్‌ఫోన్ యూజర్లకు గుడ్‌న్యూస్.. మోటరోలా నుంచి 200 ఎంపీ కెమెరాతో ఫోన్
Whatsapp | రెండు కీలకమైన సెక్యూరిటీ ఫీచర్స్ తీసుకొచ్చిన వాట్సాప్
Motorola : భారత్‌లో త్వరలో మోటో ట్యాబ్ జీ70 లాంఛ్
WhatsApp : వాట్సప్‌లో అదిరిపోయే ఫీచర్.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌కు దీటుగా
Password | మీ పాస్వర్డ్ హ్యాకర్లకు తెలిసిపోయిందని అనుమానమా? ఇలా చెక్ చేసుకోండి..